For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి అభిమానులే సినిమాని నిలబెట్టారు. వారికే ధాంక్స్ చెప్పాలి

  By Srikanya
  |

  హైదరాబాద్: మెగా కుటుంబం ఎప్పుడూ తమ అభిమానులను చాలా ప్రేమగా చూసుకుంటుంది. అదే విధంగా ..వారు కూడా మెగా హీరోల సినిమాలంటే ఓ రేంజిలో ప్రేమాభిమానాలు కురిపిస్తూంటారు. తెలిసిన విషయమే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మెగా కుటుంబం నుంచి తొలిసారిగా ఇప్పుడో హీరోయిన్ వచ్చింది.

  నాగబాబు కుమార్తె నీహారక హీరోయిన్ గా పరిచయం అవుతూ 'ఒక మనసు' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మిక్సెడ్ టాక్ వచ్చినా,విమర్శకులు బోర్ అని పెదవి విరిచినా, కలెక్షన్స్ చాలా చోట్ల బాగున్నాయి. అందుకు కారణం చిరంజీవి ఫ్యాన్సే అని చెప్తున్నారు. అలాగే వెంటనే రివ్యూలకు స్పందించి ట్రిమ్ వెర్షన్ ని అందించిన నిర్మాత మధురా శ్రీధర్ కు దక్కుతుంది అని చెప్తున్నారు.

  ముఖ్యంగా నాగశౌర్య సినిమాలు ఫెయిలై ఓపినింగ్స్ తెచ్చుకోలేని స్దితిలో ఉన్నా మెగాభిమానులు అండతో చాలా చోట్ల ఓపినింగ్స్ చాలా బాగున్నాయి. తమ మెగా కుటుంబం నుంచి నీహారికకు సపోర్ట్ చేస్తూ మెగాభిమానులు చాలా చోట్ల బ్యానర్స్ కట్టి, సినిమా ని జనంలోకి తీసుకువెళ్లటంతో తోర్పడ్డారు. టాక్ కు సంభంధం లేకుండా కలెక్షన్స్ వచ్చేలా వారు సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ''మనకు తెలిసిన సూపర్ హిట్ సినిమాల్లో కూడా తప్పులు, లోపాలు ఉంటాయి. ఒక సినిమాను వంద శాతం అందరికీ నచ్చేలా రూపొందించడం సాధ్యం కాదు. 'ఒక మనసు' కొందరికి బాగా నచ్చింది. మరికొందరు ఫర్వాలేదంటున్నారు'' అని నిర్మాత 'మధుర' శ్రీధర్.

  అలాగే కంటిన్యూ చేస్తూ....'ఒక మనసు'కి తొలుత మిశ్రమ స్పందన వచ్చినా... ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి. సినిమా మొదటి అర్ధ భాగంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువయ్యాయని అనిపించింది. వాటిలో 14 నిమిషాల నిడివి కత్తిరించాక సినిమా బాగుందంటున్నారు. మల్టీప్లెక్స్‌లో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. నీహారిక, నాగశౌర్యల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

  Chiranjeevi’s fans help Oka Manasu

  నీహారికతో మంచి సినిమా చేశారనే ప్రశంసలు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. దర్శకుడిగా రామరాజు శక్తివంచన లేకుండా ఈ సినిమా రూపొందించారు. నా తదుపరి చిత్రం కూడా ఆయన దర్శకత్వంలోనే ఉంటుంది అని తేల్చి చెప్పారు.

  అలాగే విషాదాంత కథలు మన ప్రేక్షకులకు నచ్చవనే అభిప్రాయం ఉంది. వేరే నిర్మాతలైతే ధైర్యం చేసేవారు కాదేమో. కథే మాకు ఈ సినిమా తీసేందుకు స్ఫూర్తినిచ్చింది.విడుదలకు ముందు 'ఒక మనసు'ను 'మరో చరిత్ర', 'గీతాంజలి' లాంటి సినిమాలతో పోల్చడం నాకు తప్పేమీ అనిపించలేదు.

  ఎందుకంటే మేము ఆ సినిమాలను ఆదర్శంగా తీసుకున్నాం. మిగతా భాషల్లో భిన్నమైన సినిమాలను ఆదరిస్తున్నప్పుడు మనమెందుకు అలాంటివి చేయకూడదని అనిపించింది. నచ్చిన కథలు దొరక్కే దర్శకత్వానికి దూరంగా ఉంటున్నా. నా దర్శకత్వంలో ఈ ఏడాది చివర్లో ఒక సినిమా ప్రారంభిస్తా అని అన్నారు.

  English summary
  Though panned by critics as a “bore”, Niharika’s debut film 'Oka Manasu' got a decent opening because Chiranjeevi’s fans supported the film. And now it’s picking up.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X