twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఘరానా మొగుడిగా చిరంజీవికి 26 ఏళ్లు.. రికార్డులు లెఫ్ట్ టర్నింగ్..

    By Rajababu
    |

    మెగాస్టార్ చిరంజీవిని అత్యున్నత నటశిఖరంపై నిలబెట్టిన చిత్రాల్లో ఘరానా మొగుడు ఒకటి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం రిలీజై ఈ రోజుకు 26 సంవత్సరాలు పూర్తయింది. ఘరానా మొగుడు సినిమా రిలీజైన తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ నటించిన అనురాగ ఆరలితు అనే చిత్రానికి రీమేక్.

    బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా ఘరానా మొగుడు ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ విజయంతో దేశంలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే నటుడిగా చిరంజీవి ఓ ఖ్యాతిని సంపాదించుకొన్నాడు. ఈ చిత్రంలో 'కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో.. మాస్టారూ అంటూ పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను రంజింప చేశాయి.

    Chiranjeevis Gharana Mogudu completes 26 years

    మెగాస్టార్ సరసన నగ్మా నటించిన ఈ చిత్రం 56 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకొన్నది. 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇలాంటి ఏన్నో ఘనతలు పూర్తి చేసుకొన్న ఘరానా మొగుడు చిత్రం చిరంజీవి కెరీర్‌లో ఎన్నో విజయాలకు స్ఫూర్తిగా నిలిచింది.

    English summary
    April 09, 1992. Megastar Chiranjeevi delivered one of his greatest hits, ‘Gharana Mogudu’ which redefined the very meaning of commercial success. It was the first Telugu film to gross over 100 million rupees at the box office. The film also made Chiranjeevi the highest paid actor in India. The 1992 Telugu-language action film directed by K Raghavendra Rao is a remake of the Rajkumar's superhit 1986 Kannada film, Anuraga Aralithu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X