»   » శ్రీజ బ్రైడ్ మేకింగ్: బన్నీ-స్నేహ దంపతులే హోస్ట్ చేసారు (ఫోటోస్)

శ్రీజ బ్రైడ్ మేకింగ్: బన్నీ-స్నేహ దంపతులే హోస్ట్ చేసారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి కుటుంబంలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి మొదలవ్వడమే. ఈ నెల 28న శ్రీజ వివాహం కళ్యాణ్ తో జరుగబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలో భాగంగా ఈ రోజు బ్రైడ్ మేకింగ్ సెర్మనీ(పెళ్లి కూతురును చేసే కార్యక్రమం) జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీజ పింక్ కలర్ కాంజీవరమ్ చీర ధరించింది. దీంతో శ్రీజ మరింత ఆకర్షణీయంగా కనిపించింది ఈ వేడుకలో పాల్గొన్నవారు అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అల్లు అర్జున్-స్నేహా రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ విషయాన్ని ఉపాసన మైక్రోబ్లాగింగ్ ద్వారా వెల్లడించారు. 'వెడ్డింగ్ డే 1, బ్రైడ్ మేకింగ్ సెర్మనీ. బన్నీ, స్నేహ చాలా బాగా నిర్వహించారు' అంటూ ఆమె తెలిపారు.

శ్రీజ, కళ్యాణ్ వివాహం ఈ నెల 28న ఉదయం 9.18 గంటలకు బెంగుళూరులోని చిరంజీవి ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ లో జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుకకు కొందరు ముఖ్యమైన అతిథులు, బంధువులు మాత్రమే హాజరు కాబోతున్నారు. అనంతరం మార్చి 31వ తేదీన హైదరాబాద్ లోని స్టార్ హోటల్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించి అందరికీ విందు ఇవ్వబోతున్నారు.

మరో వైపు కళ్యాణ్ ఇంట్లో కూడా పెళ్లి వేడుకకి సంబంధించిన హంగామా మొదలైంది. అక్కడ కూడా పెళ్లి కుమారుడిని తయారు చేసే కార్యక్రమం(గ్రూమ్ మేకింగ్) ఈ రోజు జరిగినట్లు తెలుస్తోంది. స్లైడ్ షోలో శ్రీజ పెళ్లి సందడికి సంబంధించిన ఫోటోలు...

శ్రీజ పెళ్లి సందడి

శ్రీజ పెళ్లి సందడి


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ ను పెళ్లాడబోతోంది.

బ్రైడ్ మేకింగ్ సెర్మనీ

బ్రైడ్ మేకింగ్ సెర్మనీ


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మీనికి సంబంధించిన ఫోటో...

ఉపాసన

ఉపాసన


శ్రీజ పెళ్లి వేడుకలో రామ్ చరణ్ భార్య ఉపాసన.

బన్నీ దంపతులు

బన్నీ దంపతులు

శ్రీజను పెళ్లి కూతురును చేసే కార్యక్రమాన్ని అల్లు అర్జున్-స్నేహ దంపతులు చేపట్టారు.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

శ్రీజను పెళ్లి కూతురును చేసిన అనంతరం... ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి.

శ్రీజ-కళ్యాణ్

శ్రీజ-కళ్యాణ్


శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాన్ ను పెళ్లాడబోతోంది.

కళ్యాణ్

కళ్యాణ్


శ్రీజను పెళ్లాడబోతున్న కళ్యాణ్ ఇతడే.

వరుడు

వరుడు


వరుడు కళ్యాణ్ ప్రముఖ వ్యాపారవేత్త కెప్టెన్ కిషన్ కుమారుడు. దుబాయ్ లోని బిట్స్ పిలాని నుండి పట్టబద్రుడయ్యాడు. శ్రీజ లండన్ లోని కావెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ పూర్తి చేసింది.

పండగ వాతావరణం

పండగ వాతావరణం


శ్రీజ పెళ్లివేడుక మొదలవ్వడంతో చిరంజీవి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

చిరంజీవి

చిరంజీవి


శ్రీజ పెళ్లివేడుకకు సంబంధించిన వేడుకలో చిరంజీవి

కేర్

కేర్


శ్రీజ పెళ్లికి సంబంధించిన చిరంజీవి, రామ్ చరణ్ చాలా కేర్ తీసుకుంటున్నారు.

స్టార్స్

స్టార్స్


శ్రీజ పెళ్లి వేడుకకు హాజరయ్యేలా మెగా ఫ్యామిలీలోని యాక్టర్లంతా తమ షూటింగ్ షెడ్యూల్స్ లో మార్పులు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీలోని స్టార్స్ అంతా ఈ పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నారు.

రిసెప్షన్

రిసెప్షన్


బెంగుళూరులో పెళ్లి జరిగిన అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు చిరంజీవి.

ఫాం హౌస్

ఫాం హౌస్


బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు.

శ్రీజ హ్యాపీ

శ్రీజ హ్యాపీ


శ్రీజ తొలి వివాహం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. కళ్యాణ్ తో వివాహం శ్రీజ చాలా హ్యాపీగా ఉంది. శ్రీజ లండన్ లోని కావెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ పూర్తి చేసింది.

సందడి

సందడి


శ్రీజ పెళ్లి వేడుకలో సందడి ఓ రేంజిలో ఉండబోతోంది.

కళ్యాణ్

కళ్యాణ్


వరుడు కళ్యాణ్ శ్రీజ చిన్ననాటి స్కూల్ మేట్ కావడంతో....ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది.

శ్రీజ-కళ్యాణ్

శ్రీజ-కళ్యాణ్


శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాన్ ను పెళ్లాడబోతోంది.

పండగ

పండగ


శ్రీజ వివాహ వేడుకతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

అయాన్

అయాన్

తమ కుమారుడితో కలిసి బన్నీ, స్నేహరెడ్డి దంపతులు

English summary
Chiranjeevi's house has attained the festive mood, as his younger daughter Srija's wedding celebrations began today with the bride making ceremony. "Dressed in a pink kanjeevaram saree, Srija looked gorgeous with that additional glow of a bride", informed a source attended the bride making event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu