»   » ఉయ్యాలవాడ నర్సింహరెడ్డిలో అక్షయ్ కుమార్.. చిరంజీవితో కలిసి...

ఉయ్యాలవాడ నర్సింహరెడ్డిలో అక్షయ్ కుమార్.. చిరంజీవితో కలిసి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో చిరంజీవితో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించనున్నారనే రూమర్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది. దక్షిణాది చిత్రాల్లో బాలీవుడ్ ప్రముఖుల తాకిడి ఈ మధ్య ఎక్కువైనంది. రోబో2 చిత్రంలో విలన్ అక్షయ్ కుమార్, వీఐపీ2 చిత్రంలో కాజల్, వివేకంలో వివేక్ ఓబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అక్షయ్ కుమార్ క్రేజ్ కారణంగా

అక్షయ్ కుమార్ క్రేజ్ కారణంగా

ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్బీ2 చిత్రం విమర్శల ప్రశంసలందుకున్నది. అంతేకాకుండా ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకులను మెప్పించింది. దక్షిణాది, బాలీవుడ్ లో క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అక్షయ్ కుమార్‌ను ఈ చిత్రంలో నటింపజేయాలని నిర్మాతల భావిస్తున్నట్టు తెలిసింది.

ఖిలాడీతో సంప్రదింపులు

ఖిలాడీతో సంప్రదింపులు

ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ఈ సంప్రదింపులు ఇంకా చర్చల స్థాయిలో ఉన్నాయని, త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

 నిర్మాతగా రాంచరణ్

నిర్మాతగా రాంచరణ్

భారత స్వాత్రంత్యం కోసం పోరాడిన గొప్ప నాయకుల్లో ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి ఒకరు. ఈయనను బ్రిటీష్ ప్రభుత్వం 1847 ఫిబ్రవరి 22న ఉరితీసింది. ఈ కథను ప్రస్తుతం మెగాస్టార్ తనయుడు రాంచరణ్ నిర్మాతగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు.

 దర్శకుడిగా సురేందర్‌రెడ్డి

దర్శకుడిగా సురేందర్‌రెడ్డి

ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డిని ఎంపిక చేసినట్టు సమాచారం. కిక్, రేసుగుర్రం, ధ్రువ చిత్రాలతో సురేందర్‌రెడ్డి మంచి జోష్ మీద ఉన్నారు.

ఖైదీ నంబర్ 150 రీఎంట్రీతో సక్సెస్

ఖైదీ నంబర్ 150 రీఎంట్రీతో సక్సెస్

సంక్రాంతి బరిలో ఖైదీ నంబర్ 150 రీఎంట్రి ఇచ్చిన చిరంజీవి భారీ హిట్‌ను సాధించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ.164 కోట్లు వసూలు చేసింది.

English summary
Rumours are rife that the Bollywood superstar Akshay Kumar is teaming with Tollywood megastar Chiranjeevi for his upcoming biopic on freedom fighter Uyyalawada Narasimha Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu