twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి చిన్నల్లుడి వేధింపుల కేసు.. పోలీసుల విచారణలో తేలిన ఆధారాలు

    |

    మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో పెళ్లి జరిగిన తర్వాత నుంచి కళ్యాణ్ దేవ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మెగా ఇంట అడుగుపెట్టాక సినిమా రంగంలోకి కూడా వచ్చేసిన కళ్యాణ్ దేవ్.. ఇటీవల తనను కొందరు వ్యక్తులు వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీస్ యంత్రాంగం విచారణ వేగవంతం చేసి కీలక ఆధారాలు రాబట్టారు. ఆ వివరాలు చూద్దామా..

    గత కొంతకాలంగా వేధింపులు

    గత కొంతకాలంగా వేధింపులు

    గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా పచ్చి బూతులు తిడుతూ దారుణమైన కామెంట్స్ పెడుతున్నారని పేర్కొంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కళ్యాణ్ దేవ్. ఈ మేరకు తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. తనను వేధిస్తున్న వారి పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

    పోలీసుల విచారణ

    పోలీసుల విచారణ

    కళ్యాణ్ దేవ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆయనపై అసభ్యమైన కామెంట్లు చేస్తూ వేధింపులకు పాల్పడిన వారి వివరాలు పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ సంస్థకు పోలీసులు నోటీసులు కూడా పంపారు. కామెంట్లు చేసిన వారి వివరాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా వారికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

    అదుపులో 10 మంది వ్యక్తులు

    అదుపులో 10 మంది వ్యక్తులు

    గత 5 రోజులుగా విచారణ వేగవంతం చేసిన పోలీసులు చివరకు పక్కా ఆధారాలతో 10 మంది వ్యక్తులను అదుపు లోకి తీసుకున్నారు. వారి వారి సోషల్ మీడియా ఐడీలతో పాటు అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ పది మందిపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారికి కోర్టు తగిన శిక్ష విధిస్తుందని పోలీసులు చెప్పారు.

    కళ్యాణ్ దేవ్ కెరీర్

    కళ్యాణ్ దేవ్ కెరీర్

    కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ వారసత్వంతో 'విజేత' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన కళ్యాణ్ దేవ్... సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నారు. త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి ఫ్యామిలీలో బాగా కలిసి పోయిన కళ్యాణ్ దేవ్... ఇటీవలి ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి మద్దతుగా కూడా ప్రచారం చేశారు.

    English summary
    Hyderabad police have booked ten people for allegedly harassing actor Chiranjeevi's son-in-law, Kalyan Dev on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X