ఆ హీరోయిన్‌తో చిరంజీవి సర్జా ఎఫైర్ నిజమే, త్వరలో పెళ్లి...
టాలీవుడ్లో నాగ చైతన్య-సమంత మూడు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో పొరుగు సినిమా ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మ్రోగబోతోంది. చైతు-సమంత మాదిరిగానే అక్కడ జరిగేది కూడా ప్రేమ వివాహమే.
టాలీవుడ్లో నాగ చైతన్య-సమంత మూడు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో పొరుగు సినిమా ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మ్రోగబోతోంది. చైతు-సమంత మాదిరిగానే అక్కడ జరిగేది కూడా ప్రేమ వివాహమే.
ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనారాజ్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకరాంతో ఇద్దరూ ఏకం కాబోతున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఎంగేజ్మెంట్ తేదీని కూడా ఖరారు చేశారు.

అలా ఇద్దరి మధ్య లవ్
హీరోయిన్ మేఘనారాజ్, చిరంజీవి సర్జా కలిసి ‘ఆటగార' అనే కన్నడ సినిమాలో జంటగా నటించారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

కొంతకాలం ఎఫైర్
కొంతకాలం ఎవరికీ తెలియకుండా లవ్ ఎఫైర్ నడిపించారు. ఈ ఇద్దరి ప్రేమ విషయమై చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎట్టకేలకు ఇద్దరూ ఈ విషయంలో ఓపెన్ అయిపోయారు.

ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్
ఈ నెల 22వ తేదీ నిశ్చితార్థం నిర్వహించి డిసెంబర్ రెండో వారంలో పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

చిరంజీవి సర్జా, మేఘనా రాజ్
చిరంజీవి సర్జా 2009లో కన్నడలో వాయుపుత్ర సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించగా. నటి మేఘానారాజ్ తెలుగుతోపాటు దక్షిణాది భాషా సినిమాల్లో నటించింది. ఈ జంట గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు.


Click it and Unblock the Notifications











