»   » అందుకే చిరంజీవి వెనక్కి తగ్గారు, మళ్లీ కొత్తగా వేట...

అందుకే చిరంజీవి వెనక్కి తగ్గారు, మళ్లీ కొత్తగా వేట...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి స్క్రిప్టు ఎంపిక విషయంలో చాలా తర్జనభర్జనలు పడుతున్నారు.

ఈ సినిమా హిట్టయితేనే తనకు మెగాస్టార్ గా గుర్తింపు, గౌరవం దక్కుతుంది, లేదంటే పరిస్థితి మరో లా ఉంటుందని ఊహించిన చిరంజీవి స్క్రిప్టు ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మధ్య పూరి ప్రాజెక్టు ఒకే చేసినా...ఎందుకనో మధ్యలో తేడా అనిపించడంతో నిర్మొమహాటంగా పక్కన పెట్టేసారు.

ఆ తర్వాత చిరంజీవి తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి వివి వినాయక్ ను దర్శకుడిగా ఓకే చేసినట్లు బయటకు లీక్ చేసారు. అభిమానులు, ప్రేక్షకుల నుండి వచ్చే స్పందన బట్టి ముందుకు స్టెప్ వేద్దామనుకున్నారు.

 Chiranjeevi searches for a new script!

అయితే చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే 150వ సినిమా రీమేక్ అయి ఉండొద్దని, కొత్త స్క్రిప్టుతో చేయాలని అభిమానుల నుండి ఫీడ్ బ్యాక్ రావడంతో చిరంజీవి కత్తి రీమేక్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కొత్త స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చిరంజీవి 150వ సినిమాకు వివి వినాయకే దర్శకుడు అనే విషయం మాత్రం దాదాపుగా ఖరారైంది.

చిరంజీవి 150వ సినిమా పక్కన పెడితే.... ఆయన 151వ సినిమా, 152వ సినిమాకు ఆల్రెడీ కమిటైనట్లు సమాచారం. 150వ సినిమా తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. చిరంజీవి 150వ సినిమాను ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నాడు.

English summary
Chiranjeevi believed in minimum guarantee hit director VV Vinayak, to shape up Katthi movie, for a remake. But after this decision, be it through the fans or the normal audience, Chiranjeevi faced a severe opposition about the remake and asked to do a movie on fresh subject, as 150th movie is a prestigious one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu