»   » చిరు హెచ్చరించాడు అయినా... పవన్ అభిమానులు ఈ సారి కూడా అలాగే

చిరు హెచ్చరించాడు అయినా... పవన్ అభిమానులు ఈ సారి కూడా అలాగే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ హాయ్‌ల్యాండ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఎంత అట్టహాసంగా జరిగిందో అంతకంటే ఎక్కువ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. అల్లు అర్జున్ పరోక్ష హెచ్చరికలు, మెగా బ్రదర్ నాగబాబు తిట్లతో వేదికపై కాక పుట్టించారు.

ఇంతకన్నా మంచి సందర్భం రాదనుకున్నారో ఏమో మనసులో దాచుకున్నదంతా వెళ్లగక్కారు. పవన్ గైర్ హాజర్ పై అన్న చిరంజీవీ, ఆయన కొడుకు చరణ్ లు మాత్రం చాలా ఫీలయ్యారని అభిమానుల సమచారం. మెగాభిమానులైతే, ఈ విషయంలో తాము పవన్ కళ్యాణ్ ను ఏమాత్రం సమర్థించలేమన్నది అభిమానుల కామెంట్.

నిన్నటి వరకు పవన్ హాజరవుతారనే సమాచారమే చిరు ఫ్యామిలీలో వుందట. పన్నెండు గంటల ప్రాంతంలో కానీ, సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కానీ ఫ్లయిట్ కు బయల్దేరతారనే సమాచారమే వుందట. పైగా పవన్ ఆఫీస్ స్టాఫ్ కూడా ఈ మెగా ఈవెంట్ కు ముందుగా రావడంతో, పవన్ రాక దృష్ట్యానే వారు వచ్చారని అభిమానులు భావించారట.

 Chiranjeevi Serious Warning To Pawan Fan

అప్పటికీ నాలుగు గంటల ప్రాంతంలో చరణ్ స్వయంగా పవన్ వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేసి, బయల్దేరున్నారా లేదా అన్నది వాకబు చేసినట్లు అభిమానుల్లో వినిపిస్తొంది. రూమ్ లో వున్నారని, బయల్దేరతారో లేదో తెలియదని సమాధానంరావడంతో రారని చరణ్ ఫిక్సయ్యారట. అది అలా ఉంటే ఇక పవన్ ఫ్యాన్స్ మరో వైపు హంగామా చేసారు.

అయితే ఈ ఈవెంట్‌లో జరిగిన ఓ ఘటన చిరంజీవికి కోపాన్ని, ఒకింత చికాకును తెప్పించింది. మొదటి నుంచి అనుకుంటున్నట్లు గానే ఈ వేడుకకు వేలమంది మెగా ఫ్యాన్స్ హాజరయ్యారు. పవన్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో వేదికకు అతి సమీపంలో ఉన్న ఓ పవన్ అభిమాని బాగా ఇబ్బంది పెట్టాడు. చేతిలో ఉన్న జనసేన జెండాను ఊపుతూ కనిపించాడు. పవర్‌స్టార్, పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేశాడు. ఈ దృశ్యం చిరు కంట పడింది. వెంటనే మాట్లాడటం ఆపేసి జెండా కిందకు దించాలని హెచ్చరించాడు.

మెగాస్టార్ చూశాడనో ఏమో ఆ పవన్ అభిమాని మరింత రెచ్చిపోయాడు. ఇంకాస్త ఎక్కువగా జెండాను గాల్లోకి లేపుతూ నానా హంగామా సృష్టించాడు. మరోమారు మెగాస్టార్ హెచ్చరించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి చేసేదేమీ లేక చిరంజీవి స్పీచ్‌ను కొనసాగించి ముగించాడు. ఈ ఒక్క అభిమాని చేతిలోనే కాదు వేడుకకు వచ్చిన చాలామంది చేతుల్లో జనసేన జెండాలు కనిపించాయి. పవన్ అభిమానులు చిరంజీవికి పెద్ద తలనొప్పిగా మారారని సినీ జనం మాట్లాడుకుంటున్నారు.

English summary
pawar star pawan Kalyan fans Creats s nusens at khaidi no 150 pre Release function in Hailand Guntur
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu