»   »  వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ చూసి చిరంజీవి షాకయ్యారు!

వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ చూసి చిరంజీవి షాకయ్యారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ తేజ్ నటించిన 'తొలి ప్రేమ' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాపీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 'ఫిదా' తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో మరో భారీ హిట్ పడింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

 దిల్ రాజుకు రుణపడి ఉంటానన్న వరుణ్ తేజ్

దిల్ రాజుకు రుణపడి ఉంటానన్న వరుణ్ తేజ్

‘ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కాక పోయినా ఈ సినిమాను అందరి కంటే ఎక్కువగా నమ్మి ముందుకు తీసుకొచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. మీరు లేకుంటే ఈ సినిమా మొదలయ్యేది కాదు. వెంకీ మీద, నా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం.' అని వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు.

 చిరంజీవిగారు చూసి షాకయ్యారు

చిరంజీవిగారు చూసి షాకయ్యారు

‘తొలి ప్రేమ' చూసిన తర్వాత చిరంజీవిగారు షాకయ్యారు. డెబ్యూ డైరెక్టర్ ఇంత బాగా తీశాడా? అని ఆశ్చర్యపోయారు. చిరంజీవిగారి నుండి ఇలాంటి రెస్పాన్స్ రావడం వెంకీకి చాలా పెద్ద కాంప్లిమెంట్.... అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

 వెంకీకి మంచి భవిష్యత్ ఉంది

వెంకీకి మంచి భవిష్యత్ ఉంది

దర్శకుడు వెంకీ అట్లూరి కన్విక్షన్, సినిమాపై అతడికి ఉన్న ఇష్టం అన్నీ ఇందులో కనిపిస్తాయి. అతడికి మంచి భవిష్యత్ ఉంది... అని వరుణ్ తేజ్ తెలిపారు.

 తెర వెనక వారి కెమిస్ట్రీ బావుంది

తెర వెనక వారి కెమిస్ట్రీ బావుంది

సినిమా విడుదలైన దగ్గర నుండి నా గురించి, రాశి ఖన్నా కమెస్ట్రీ గురించే మాట్లాడుతున్నారు. అది ఎంత బావున్నా కూడా కెమెరా వెనక ఉండే జార్జ్, తమన్, వెంకీ మధ్యలో ఉండే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కాబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అని వరుణ్ తేజ్ తెలిపారు.

 తెర వెనక

తెర వెనక

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రానికి సంగీతంః ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: జార్జ్ సి.విలియ‌మ్స్‌.

English summary
Chiranjeevi shocked after watching Tholi prema Movie. holi Prema directed by debutant Venky Atluri and is being produced by B. V. S. N. Prasad under his banner Sri Venkateswara Cine Chitra. It will feature Varun Tej and Raashi Khanna in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu