»   » అవినా 'బావ' సంబంధం: అల్లు అరవింద్‌ను ఉద్దేశించి చిరంజీవి

అవినా 'బావ' సంబంధం: అల్లు అరవింద్‌ను ఉద్దేశించి చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi - Allu Arjun
గీతా ఆర్ట్ర్స్‌తో తనకు అవినా'బావ' సందర్భం ఉందని ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి తన బావమరిది అల్లు అరవింద్‌ను ఉద్దేశించి అన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన బద్రీనాథ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన సోమవారం సాయంత్రం మాట్లాడారు. ప్రజల ఆదరాభిమానాలు పొందిన అదృష్టవంతుల్లో తాను ఒక్కడినని ఆయన అన్నారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలే తమకు ఊపిరి, ప్రాణ వాయువు అని ఆయన అన్నారు. ప్రేక్షకుల అభిమానమే తమను ముందుకు నడిపించే శక్తి అని ఆయన చెప్పారు.

ప్రేక్షకుల అభిమానమే తనను ఇంతవాడ్ని చేసిందని, తననే కాకుండా తన తర్వాతి తరం వారిని కూడా ప్రజలు ఆదరిస్తున్నారని, ఇది ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. బన్నీ ప్రతి సినిమాను ఎంతో కష్టపడి చేస్తాడని, కుటుంబంలో వాడిగా చూసి తాను ఈ మాటలు చెబుతున్నానని ఆయన అన్నారు. చేయి ఫ్రాక్చర్ అయినా సినిమా షూటింగులో పాల్గొన్నాడని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి బన్నీ కృతజ్ఞతలు చెప్పారు.

English summary
Prajarajyam president mega star Chiranjeevi attended Allu Arjun's Bhadrinath film audio releasing function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu