Just In
- 2 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 55 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
ఏపీకి గుడ్ న్యూస్.. కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ లైసెన్స్.. మార్చి నుంచి విమాన రాకపోకలు
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంచిని మైక్‌లో.. చెడును చెవిలో చెప్పాలి.. మా విభేదాలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..

కొత్త ఏడాది కాదు.. దశాబ్దం దిశగా
నూతన సంవత్సరమే కాకుండా కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్నామనే విషయాన్ని గ్రహించాలి. ఈ దశాబ్దం అంతా గొప్పగా సాగాలనే సంకల్పంతో ముందుకెళ్లాలి. ఈ దశాబ్దం మొత్తం ఏం చేయాలో భవిష్యత్ ప్రణాళికను రచించుకోవాలి. స్వప్రయోజనాలను పక్కన పెట్టి కళామతళ్లికి సేవ చేసుకోవాలి. ఈ డైరీని 20 సంవత్సరాలుగా ప్రింట్ చేస్తూనే ఉన్నాం అని చిరంజీవి తెలిపారు.

సుబ్బిరామిరెడ్డి సేవల గురించి
డైరీ ఆవిష్కరణకు కారణం నిర్మాత సుబ్బిరామిరెడ్డి. గతంలో ఏపీని వరదలు ముంచెత్తినప్పుడు ప్రజల బాధలను అర్ధం చేసుకొని వారికి సహాయం అందించడానికి ముందుకొచ్చారు. క్రికెటర్లు, సినీ తారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి విరాళాలను సేకరించారు. ఆ క్రమంలో విమానంలో ప్రయాణిస్తుండగా ఆర్టిస్టుల అసోసియేషన్ గురించి మురళీమోహన్‌తో చర్చించాను అని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు.

నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా
మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేయాలని ఆ తర్వాత నిర్ణయం తీసుకొన్నాం. మురళీమోహన్‌ను అధ్యక్షుడిగా పనిచేయాలని సూచిస్తే.. మీకు గ్లామర్ ఉంది. ఆ పదవిని మీరు నిర్వహిస్తేనే బాగుంటుందని పట్టుబట్టారు. తాను జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను ముందుకు నడిపించారు. తోటి ఆర్టిస్లుల చక్కని సమన్యయంతో అసోసియేషన్ ముందుకు సాగింది అని చిరంజీవి పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోనే ఆర్టిస్టుల ఫోన్ నంబర్లతో కూడిన డైరీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నాం అని చిరంజీవి వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీకి ఓ డైరీ
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే ఆర్టిస్టులకు ఉపయోగపడేలా డైరీని రూపొందించాం. ఆ తర్వాత ఆర్టిస్టులకు పెన్షన్లు, ఇన్సూరెన్స్ తదితర కార్యక్రమాలను ప్రారంభించాం. దివంగత విజయనిర్మల పేరిట కొనసాగిస్తున్న పెన్షన్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా అధ్యక్షుడు వీకే నరేష్‌ను మెగాస్టార్ చిరంజీవి కోరారు.

విభేదాలను పక్కన పెడుదాం
మా అసోసియేషన్ కోసం భూమి కోసం మంత్రి కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశాను. మాలో కొన్ని కుమ్ములాటలు, అంతర్గత విభేదాల కారణంగా అది వాయిదా పడింది. తమిళ పరిశ్రమలో నడిగర సంఘం గొప్పగా ఫండ్ క్రియేట్ చేసింది. పేద ఆర్టిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారనే విషయం తెలుసుకోని ఈర్ష పడ్డాను. కానీ ఆ సంఘంలో లుకలుకలు రావడం చూసి వేగంగా నిర్ణయాలు తీసుకొంటే ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయని అనుకొన్నాను. సంఘంలో మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పుకొందాం. చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పుకొందాం. విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగుదాం అని చిరంజీవి సభ్యులకు సూచించారు.