»   » ఖరీదైన బర్త్‌డే గిఫ్ట్: రామ్ చరణ్‌ను సర్పైజ్ చేసిన మెగాస్టార్ దంపతులు!

ఖరీదైన బర్త్‌డే గిఫ్ట్: రామ్ చరణ్‌ను సర్పైజ్ చేసిన మెగాస్టార్ దంపతులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi Gifted Ram Charan A Expensive Gift

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27న) సందర్భంగా ఆయన తల్లిదండ్రులు సురేఖ-చిరంజీవి దంపతులు ఖరీదైన బహుబతి ఇచ్చారు. తమ కుమారుడి కోసం మెగాస్టార్ దంపతులు విదేశాల నుండి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వాచీ తెప్పించారు.

తనకు అడ్వాన్స్‌గా పుట్టినరోజు గిప్టు అందించిన అమ్నా, నాన్నకు థాంక్స్ చెబుతూ రామ్ చరణ్ ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. మార్చి 27తో రామ్ చరణ్ 33వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.

Chiranjeevi Surprise Birthday gift to Ram Charan

మెగాస్టార్ వారసత్వంతో 2007లో రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' చిత్రంతో తెరంగ్రేటం చేసిన రామ్ చరణ్ తనదైన టాలెంటుతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. 'మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంతో పాటు ఎన్నో విజయాలు అందుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Chiranjeevi Surprise Birthday gift to Ram Charan

ప్రస్తుతం రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వం చేయబోతున్నారు.

English summary
Chiranjeevi Surprise Birthday gift to Ram Charan. This March 27, Ram Charan turns 33. Ram Charan is an Indian film actor, dancer, producer, businessman and entrepreneur, who works in Telugu cinema. He is the recipient of two Nandi Awards, two South Filmfare awards, two CineMAA Awards, and two Santosham Best Actor Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X