twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్పోరేట్ హాస్పిటల్‌లో శవానికి వైద్యం.. చిరంజీవి ఠాగూర్ సినిమాను తలపించిన సీన్!

    |

    నిజజీవితంలోని సంఘటనల ఆధారంగానే సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయితే సినిమాల్లో చూపించినట్లు నమ్మడానికి కాస్త సందేహంగానే ఉన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడైనా రియల్ లైఫ్ లో జరిగినప్పుడు మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఠాగూర్ సినిమాలో కొన్ని సన్నివేశాలు దాదాపు నిజ జీవితంలో నుంచి తీసుకున్నవే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా జనాలను కూడా ఎంతో ఆలోచింపజేసింది.

    అయితే అందులోని ఒక ముఖ్యమైన సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన ఒక సన్నివేశం సినిమా మొత్తంలో కూడా చాలా హైలెట్ గా నిలుస్తుంది. ఒక విధంగా అది నిజంగా జరిగిందే. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు హాస్పిటల్ బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించకపోతే మరికొంత ట్రీట్మెంట్ చేస్తే బ్రతికే అవకాశం ఉంది అని చెప్పి బ్యాలెన్స్ డబ్బులు మొత్తం కూడా కట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

    ఇక అలాంటి ఒక సంఘటన హైదరాబాద్ లోని నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్ లో చనిపోయిన శవానికి గంటల తరబడి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నాటకమాడి డబ్బులు తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే 14వ తేదీన అమ్మాయి చనిపోతే 15వ తేదీ కూడా ట్రీట్మెంట్ కొనసాగించినట్లు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

    Chiranjeevi tagore movie real scene repeat in nalgonda corporate hospital

    అప్పులు చేసి మరి డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యానికి ఖర్చు చేస్తూ ఉంటే యాజమాన్యం మాత్రం ఈ విధంగా చేయడం చాలా అన్యాయం అని మరికొందరు ఆరోపిస్తున్నారు. 21 ఏళ్ల అమ్మాయి డెంగ్యూ ఫీవర్ తో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక అమ్మాయి ట్రీట్మెంట్ కోసం అని చాలా డబ్బులు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా మందులకు రక్తం మార్పిడి కోసం అవసరమవుతుంది అని మరింత డబ్బు అడిగినట్లుగా కూడా చెబుతున్నారు. మరి ఈ ఆరోపణలకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి.

    English summary
    Chiranjeevi tagore movie real scene repeat in nalgonda corporate hospital..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X