twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "20 ఏళ్లుగా చిరంజీవే నెంబర్ వన్"

    By Staff
    |
    Chiranjeevi with Venkatesh
    చిరంజీవి కవర్ పేజీతో తాజాగా ఇండియా టుడే విడుదల అయింది. చిరంజీవిపై అందులో హీరో వెంకటేష్ అభిప్రాయం ఉంది. 1986లో కలియుగ పాండవులు సినిమాతో సినీ వెంకటేష్ రంగప్రవేశం చేసేనాటికే చిరంజీవి పేరున్న హీరోగా ఉన్నారు. 20 ఏళ్ల తరువాత కూడా ఆనాడు ఎంతటి ఉత్సాహంతో నటిస్తున్నారో ఇపుడు కూడా చిరంజీవి అంతటి ఉత్సాహంతో నటిస్తున్నారని వెంకటేష్ చెప్పారు. కెమరా ముందు చిరంజీవి చూపించే ఉత్సాహం, వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావం చూస్తే మతిపోతుంది...సాధారణంగా ఒకే పని కొన్నేళ్లు చేసిన తరువాత ఎటువంటి వారికైనా విసుగు రావడం ఖాయం...విరామం కోరడం సహజం...కానీ 30 ఏళ్లుగా నటిస్తున్నా చిరంజీవిలో అదే ఉత్సాహం, అదే ఉషారు...అందుకే ఆయన తన సమకాలికులతో పాటు తరువాతి తరాల వారికి కూడా స్ఫూర్తి ప్రధాత అయ్యారు. ఎన్టీఆర్, అక్కినేని, శివాజీ గణేషన్, ఎమ్జీఆర్ లలోనూ ఇదే లక్షణం ఉందన్న విషయం గమనించవచ్చు..అంత పెద్ద తార చిరంజీవి నా పెళ్లికి స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెప్పిన సందర్భం నాకిప్పటికీ గుర్తు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకునే ఆయన గుణం నాకెంతో నచ్చుతుంది. నటుడిగా ఆయనలో నచ్చే గుణం ఏమంటే తెరపై ఆయన చూపే ఉత్సాహం, హుషారు..నృత్యాలు కానివ్వండి...ఏది చేసినా అందులో అంతటి హై ఎనర్జీ చూపడం ఎవరైనా నేర్చుకోదగ్గ విషయం...ఆయనలోని ఆ శక్తి, ఉత్సాహాలు చూసి స్ఫూర్తి పొందే నేను నటన నుంచి స్ఫూర్తి పొందలేదు..ఎందుకంటే నేనసలు ఎప్పుడూ సినీ నటుణ్ణి కావాలనుకోలేదు...అలాగే చిరంజీవి నుంచి నేను ప్రత్యేకించి నటనలో సలహాలు, సూచనలు తీసుకున్న సందర్భాలు కూడా ఎన్నడూ లేవు...అంత మాత్రనా ఆయనను నేనేదో తక్కువ చేసినట్టు కాదు..చిరంజీవి 1987నుంచి తెలుగు సినీ రంగంలో నంబర్ వన్ గా నిలిచారు...నిజంగా ఇది కష్టమైన విషయం..నిత్య శ్రమతో ఆ స్థాయిని చిరంజీవి ఇప్పటికీ నిలబెట్టుకోవడం గొప్పవిషయం. దీనికి కూడ ఆయనలోని పట్టుదల ఉత్సాహమే కారణం. పాతతరం వాళ్లపై మోజు తగ్గుతున్న సమయంలో చిరంజీవి తెరపైకి వేగంగా దూసుకు వచ్చారు. సరైన సమయంలో కొత్త తరహా నృత్యాలు, ఫైట్లతో ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకోగలిగారు..ముఖ్యంగా ఖైదీ ఆయనను ఇప్పుడున్న స్థాయికి తీసుకురావడంలో బలమైన పునాదిగా నిలిచింది. ఖైదీ చిత్రం విడుదలైనప్పటి సంగతులు నాకిప్పటికీ బాగా గుర్తు. అప్పటికి నేనింకా అమెరికాలో ఉన్నాను..అక్కడే చదువుకుంటున్నాను..అక్కడ సిల్వెస్టర్ స్టాలిన్ నటించిన ర్యాంబో చిత్రం చూశా...ఆ తరహా చిత్రం మన తెలుగులో వస్తే బాగుంటుందని నాకు అనిపించింది...తీరా నేను భారత్ కు వచ్చిన తరువాత చూస్తే ఖైదీ అచ్చు అలాంటి చిత్రమేనని అర్థమైంది...అప్పటికి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తయారైన చక్కటి యాక్షన్ చిత్రం అది..అప్పటి నుంచి ఇప్పటి దాకా నేను, ఆయన ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా మామధ్య ఆహ్లాదకరమైన వాతావరణమే నెలకొంటుంది. ఆయనలో ఓ మెగాస్టార్ కన్నా..మనసున్న మామూలు మంచి మనిషినే ఎక్కువగా చూస్తుంటాను..ఆయన కూడా నన్నెప్పుడూ ఓ సినిమా తారగా చూడరు..ఒక్కమాటలో చెప్పాలంటే మేమిద్దరం ఒకరి అంతరంగాలను ఒకరం చూసుకుంటూ ఉంటాం..ఆత్మాన్వేషణలో గడిపేస్తుంటాం..చిరంజీవిలో సహనానికీ, సంయమనానికీ అదే కారణమేమో..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X