For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

  By Staff
  |

  మెగాస్టార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, వెండితెర ముద్దు భిడ్డయైన చిరంజీవీ గారికి దట్స్ తెలుగు తరపున శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి కొత్తగా పాలిటిక్స్ లోకి ఎంటరై స్వంతంగా ప్రజా రాజ్యం పార్టీని నెలకొల్పారు. ఈ సందర్భంగా చిరంజీవి తన 54వ పుట్టిన రోజు వేడుకులను ఆగష్టు 22 న జరుపుకోబోతున్నారు. చిరంజీవి(శివ శంకర వరప్రసాద్) 1955 సంవత్సరంలో మొగళ్తూరులో కొనిదల వెంకటరావు, అంజనా దేవి కి జన్మించారు. అందరూ చిరు అని అభిమానంగా పిలుస్తుంటారు. ఇండియాలో 50 మంది పవర్ ఫుల్ పర్సన్స్ లో తనూ ఒక్కరుగా నిలిచారు. చిరంజీవి తన సినిమా కెరీర్ ను మొదటగా 1978 లో రాజ్ కుమార్ దర్శకత్వంలో 'పునాదిరాళ్ళు"తో ప్రారంభించారు. కానీ మొదట 'ప్రాణం కరీదు" సినిమా 1978 లో రిలీస్ అయింది. దాని తర్వతా చిన్న చిన్న విలన్ పాత్రలను పోషించారు(మనఊరి పాండవులు, అడవి దొంగ). తర్వాత 1980 లో పున్నమినాగు, న్యాయంకోసం సినిమాతో ప్రేక్షకులలో మంచి స్థానానన్ని సంపాదించుకొన్నారు. తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ 1983 లో 'ఖైదీ" తో టాలీవుడ్లో స్టార్ గా నిలదొక్కుకున్నారు.

  కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ అభిలాష(1983), చాలెంజ్(1984), పసివాడిప్రాణం(1987), అత్తకు యముడు అమ్మాయికు మొగుడు(1989), జగదేక వీరుడు అతిలోక సుందరి(1990), కొదమసింహ్మం(1990), గ్యాంగ్ లీడర్(1991), రౌడిఅల్లుడు(1991), ఘరానా మొగుడు(1992), తర్వాత కొద్ది విరామం తర్వాత మరికొన్ని సూపర్ హిట్ సినిమాతో మాస్టర్(1997), చూడాలనివుంది(1998), భావగారు భాగున్నారా(1998), స్నేహం కోసం(1999) సినిమా లతో ప్రేక్షకులకు, చిరు ఫ్యాన్స్ కు మరింత చేరువయ్యారు.

  నటుడు, కమేడియన్ అల్లురామలింగయ్య కూతురైన సురేఖాను చిరంజీవి వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, (సుష్మిత, శ్రీజ) కుమారుడు రామ్ చరణ్ తేజ. సుష్మిత చెన్నైలోని విష్ణుప్రసాద్ తో వివాహం జరిగింది. శ్రీజ షిరీస్ భరద్వాజ్ ను ప్రేమ వివాహం చేసుకొన్నది. రామ్ చరణ్ తేజ సూపర్ హిట్ సినిమా 'చిరుత" ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచాడు. తను నటించిన రీసెంట్ చిత్రం 'మగధీర" ఆంధ్రదేశం అంతా ఒక ఊపు ఊపుతున్నది.

  చిరంజీవి సాంఘిక సేవా దృక్పతంతో పాలిటిక్స్ లో ఎంటరై ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 'సినిమాల్లో ఉన్నపళంగా నాకు ఈ మెగాస్టార్ ఇమేజ్ రాలేదు....రాజకీయాల్లోనూ అంతే....రాజకీయాల్లో ఏ బిరుదు ఇచ్చినా అది మీరే ఇవ్వాలి....నేను రాజకీయాల్లోకొచ్చింది సేవ చేయడానికి మాత్రమే...సినిమాల్లో మెగాస్టార్ లా, రాజకీయాల్లో ఏ ఇమేజ్ ఇస్తారో...ఆ ఇమేజ్ కోసం ఎదురుచూస్తాను...ప్రజా సేవ కోసం కష్టపడతాను..." అంటున్న చిరంజీవిగారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. నేడు 54వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంటోన్న చిరంజీవి అన్నయ్యకు చిరు ఫ్యాన్స్ తరపున విషెస్ అందజేద్దాం.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X