»   »  శోభన్ భౌతిక కాయాన్ని సందర్శించిన చిరు

శోభన్ భౌతిక కాయాన్ని సందర్శించిన చిరు

Posted By:
Subscribe to Filmibeat Telugu


గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందిన శోభన్ భౌతిక కాయాన్ని మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. శోభన్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఆ తరువాత మీడుయాతో మాట్లాడుతూ శోభన్ కుటుంబాన్ని అన్ని విధాల ఆధుకుంటామని చిరంజీవి అన్నారు. హీరోయిన్ భూమిక కూడా శోభన్ ఇంటికి వచ్చి ఆయన భార్యను అనునయించింది. భూమిక కూడా కన్నీరు మున్నీరైంది.

కొత్త సినిమాకు కథపై చర్చించేందుకు ప్రముఖ నటి భూమిక నివాసానికి వెళ్లిన శోభన్ కు అక్కడ ఉండగానే గుండెపోటు రావడంతో వెంటనే మాదాపూర్లోని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు చెప్పిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో రాంగోపాల్ వర్మతో పనిచేసిన శోభన్ ఆతరువాత కృష్ణవంశీతో కూడా కలిసి పనిచేశాడు. ఒక రాజు ఒక రాణి సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించారు. మహేష్ బాబు హీరోగా రూపొందిన బాబీ శోభన్ కు దర్శకుడిగా తొలి సినిమా. అనంతరం ప్రభాస్, త్రిషలతో రూపొందిన వర్షం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X