»   » మహేష్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, అంతా ఆశ్చర్యం...ఏం జరుగుతోంది?

మహేష్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, అంతా ఆశ్చర్యం...ఏం జరుగుతోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ హీరోలు ..ఒకరి సెట్ మరొకరు ఖాళీ దొరకినప్పుడు వెళ్లి హాయ్ చెప్పటం, అది మీడియాలో హైలెట్ కావటం మనకు కొత్తేమీకాదు. అదే పద్దతిలో ఆ మధ్యన చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం 150 షూటింగ్ స్పాటుకు చాలామంది యంగ్ హీరోలు వచ్చారు. ఇప్పుడు అదే విధాన్ని సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కంటిన్యూ చేస్తున్నారు.

అప్పట్లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లొకేషన్ కు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడ మహేష్ బాబు కు కూడా అలాగే షాకిచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతోంది. మురుగుదాస్ అక్కడే వేసిన సెట్ లో హీరోపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నాడు.

ఆ పక్కనే మీలో ఎవరు కోటీశ్వరుడు టివి షో షూటింగ్ లో ఉన్న చిరంజీవి.. పక్కనే జరుగుతున్న మహేష్ షూట్ కు విచ్చేయడంతో.. యునిట్ అంతా మొదట ఆశ్చర్యం ..ఆ తర్వాత ఆనందపడ్డారు. ఇలా మహేష్ సినిమా సెట్టుకు మెగా అతిథి వచ్చారని.. ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అభిమానులతో పంచుకున్నారు.

ఇక చిరంజీవి కేవలం క్యాజువల్ గా మహేష్ ని, మురగదాస్ ని పలకరించటానికే ఆ సెట్ కు వచ్చారని సమచారం. మురగదాస్, మహేష్ కాంబినేషన్ లో గతంలో స్టాలిన్ చిత్రం తెరకెక్కింది. మురగదాస్ కథతో చిరంజీవి రీసెంట్ గా ఖైది నెంబర్ 150, అలాగే అంతకు ముందు ఠాగూర్ వంటి రెండు సూపర్ హిట్స్ ఇచ్చారు.

చిత్రం విశేషాలకు వస్తే... చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. అనంతరం 11 వ తేదీ నుండి చెన్నైలో షెడ్యూల్ జరుపనున్న యూనిట్ ఆ తర్వాత 23 న వియత్నాం వెళ్లనున్నారు. అక్కడే 30వ తేదీ వరకు కొన్ని కీలకమైన ఫైట్ సీన్స్ ని తెరకెక్కించనున్నారు దర్శకుడు మురుగదాస్.

ఈ ఫైట్ సీన్స్ కోసం భారీ మొత్తం ఖర్చు పెట్టున్నారు. ఈ ఫైట్ సీన్ల కోసం స్టార్ యాక్షన్ కొరియోగ్రఫర్లు పీటర్ హెయిన్స్, కణల్ కణ్ణన్, అన్బరివ్ లు పనిచేస్తున్నారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా లో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఈ చిత్రం యొక్క టైటిల్, ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ల విడుదల తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది .

మరో ప్రక్క ఈ చిత్రం టీజర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది. దర్శకుడు మురుగదాస్ చిత్ర టీజర్ ను భారీ గ్రాఫికల్ వర్క్ తో, హై క్వాలిటీలో ఉండేలా రూపొందిస్తున్నారట. అది కూడా యూకేలో చేస్తున్నారని సమాచారం. దాదాపు 30 సెకన్ల నిడివి ఉండే ఈ టీజర్ ద్వారా సినిమా స్టోరీ లైన్ ఏమిటనేది చెప్తారట.

English summary
Megastar Chiranjeevi paid a visit to Mahesh Babu's movie sets that is progressing in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu