»   » సల్మాన్‌కు 5 ఏళ్ల జైలు: చిరంజీవి, ఇతర స్టార్ల స్పందన...

సల్మాన్‌కు 5 ఏళ్ల జైలు: చిరంజీవి, ఇతర స్టార్ల స్పందన...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌.... ఒకరి ప్రాణాలు పోవడానికి, నలుగురు గాయపడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బెయిలు కోసం సల్మాన్ ఖాన్ ముంబై హైకోర్టును ఆశ్రయించబోతున్నాడు.

కాగా సల్మాన్ ఖాన్ కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ముందు నుండి మద్దుతుగా ఉంటూ వచ్చారు. ఆయనకు శిక్ష పడకూడదని నిన్న నుండే ప్రార్థనలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ కేసులో కోర్టు అతన్ని దోషిగా తేల్చి శిక్ష వేయడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కన్నీటి పర్యంతం అయ్యారు.

Chiranjevi reactions on Salman's verdict

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి స్పందిస్తూ... నా తోటి కళాకారుడు దోషిగా తేలడంపై నాకూ చాలా బాధగా ఉంది. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. కావాలని చేసింది కాదు. ఆయనకు పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. కర్చితంగా ఆయనకు శిక్ష వేసే సమయంలో న్యాయమూర్తి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను. ఆయన నటిస్తున్న సినిమాలు పూర్తి చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష ఎక్కువ కాలం పడకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు నటి హేమా మాలిని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరో వైపు బాలీవుడ్ స్టార్లు సోనాక్షి సిన్హా, ప్రీతి జింతా ముంబైలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్టుమెంటుకు వెళ్లి బాదలో ఉన్న సల్మాన్ తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు స్పందిస్తూ....సల్మాన్ ఖాన్ మంచి మనిషి అని, అతనికి అందరూ అండగా నిలవాలి అని కోరారు.

తన తల్లి ప్రాణాలు కాపాడిన మంచి మనిషి సల్మాన్ ఖాన్ అని, అతని మేలు ఉన్నటికీ మర్చిపోలేనని నటి దియా మీర్జా చెప్పుకొచ్చారు. 

సల్మాన్ కు శిక్ష విధించారనే వార్త దిగ్బ్రాంతిని కలిగించిందని నటి సోనాక్షి సిన్హా వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ చాలా మంచి మనిషి, ఆయన ఎన్నో మంచి పనులు చేసారు. దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆమె అన్నారు.

సల్మాన్ ఖాన్ కు శిక్ష పడిందనే విషయం తెలియగానే గుండె ఆగినంత పని అయిందని నటుడు కునాల్ కోహ్లి చెప్పుకొచ్చారు.

సల్మాన్ ఖాన్ దోషి అని ఎవరు చెప్పినా తన మద్దతు మాత్రం సల్మాన్ ఖాన్ కే ఉంటుందని నటుడు అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు. 

మన వాళ్లెవరైనా తప్పు చేసినా శిక్ష పడితే బాధ పడతాం. సల్మాన్ ఖాన్ అంటే తమకు ఇస్టమని, తామంతా ఆయనకు మద్దతుగా ఉంటామని అలియా భట్ పేర్కొన్నారు. ఎంతో మందికి మంచి చేసిన సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష చాలా ఎక్కువ అన్నారు దర్శకురాలు ఫరా ఖాన్. 

సెలబ్రిటీల ట్వీట్లు...

English summary
Chiranjevi reactions on Salman's verdict. Salman Khan has been proven guilty in the court of law for the 2002 hit-and-run case.
Please Wait while comments are loading...