»   »  ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ : దేవి ప్లేస్ లోకి వచ్చిన మ్యాజిక్ డైరక్టర్ ఎవరంటే...

‘గౌతమి పుత్ర శాతకర్ణి’ : దేవి ప్లేస్ లోకి వచ్చిన మ్యాజిక్ డైరక్టర్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరక్షన్ లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం'గౌతమి పుత్ర శాతకర్ణి' . బాలయ్య 100వ సినిమా అయిన ఈ చిత్రంకు సంభందించిన ప్రతీ విషయం.. తెలుగు సినీ పరిశ్రమలో కొద్దికాలంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రముఖ సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవటం అందరికీ షాక్ ఇచ్చింది.

సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలాంటి చారిత్రక సినిమా కోసం ఎక్కువ కాలం కష్టపడాల్సి ఉన్నందున, ఇతర కమిట్‌మెంట్స్ వల్ల అది సాధ్యపడదనే దేవిశ్రీ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారని తెలుస్తోంది.

షాక్: 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' నుంచి దేవిశ్రీప్రసాద్ బయిటకు,కారణం ఏంటి

ఇక దేవిశ్రీ ప్రసాద్ వెళ్ళిపోవడంతో ప్రస్తుతం క్రిష్ వేరొక సంగీత దర్శకుడిని సంప్రదించి ఫైనలైజ్ చేసారని సమాచారం. ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు.. చిరంతన్ భట్‌ అని తెలుస్తోంది. కంచె చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్ భట్ నే మరోసారి తన చిత్రానికి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు క్రిష్. అందరూ ఇళయరాజా ని కానీ కీరవాణిని కానీ సీన్ లోకి తీసుకువస్తారనుకుంటే క్రిష్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు.

Chirantan Bhatt music for Krish’s Gautamiputra Satakarni

క్రిష్‌ మాట్లాడుతూ... బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర నిర్మాణం 40 శాతం వరకు పూర్తయిందని, వివిధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో గొప్పగా తీస్తున్నామని చెప్పారు. శాతవాహనుల గురించి చదువుకున్నామేగానీ, తిలకించలేదని, ఇది తెలుగు జాతికి సంబంధించిన చిత్రమని పేర్కొన్నారు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ స్వయంగా నిర్మిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను క్రిష్, బాలయ్య కెరీర్‌కు మరపురాని సినిమాగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు.

English summary
Bollywood music composer Chirantan Bhatt, who gave soulful music for Krish’s Kanche, has been roped in to score the music for this much anticipated historical drama Gautamiputra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu