»   » చిరు 150 వ చిత్రం మార్చారా..ఈ టైటిలా...పోస్టర్ ఇదేనా?

చిరు 150 వ చిత్రం మార్చారా..ఈ టైటిలా...పోస్టర్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి తన 150 వ చిత్రం టైటిల్ ఏంటనేది గత కొంతకాలంగా అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదట కత్తిలాంటోడు అనే టైటిల్ ని సినిమా ప్రారంభానికి ముందు ఫ్యాన్స్ సమక్షంలో ప్రకటించారు. అయితే రామ్ చరణ్ ఆ మధ్యన ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఆ టైటిల్ ఉండదని తేల్చి చెప్పారు.

అయితే ఇప్పుడు మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సంగ్ధిదతకు చరమాంకం పాడుతూ చిరు 150వ చిత్రానికి టైటిల్ ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి టైటిల్‌ 'నెపోలియన్' అని ధృవీకరిస్తూ 'పోరాటం అతని నైజం' అనే ఉపశీర్షికను జత చేసి వదిలారు.

చిరంజీవి కు చెందిన ఫేస్‌బుక్ పేజ్‌లో 'మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం టైటిల్ ఖరారు' అంటూ టైటిల్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. ఆ చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో పొలం దున్నుతున్న రైతు ఫొటోను, చిరంజీవి ఫొటోను ఇచ్చి చిరంజీవి ముఖంపై భూభత్సం, రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్‌లను ప్రచురించారు.

Chiru 150th Movie Title Confirmed Officially?

ఈ చిత్రంలో ల్యాండ్ మాఫియా, రైతుల ఆత్మహత్యలు వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా చిరు కనిపించనున్నట్లు ఈ ఫొటో ధృవీకరిస్తోంది. తన రీఎంట్రీ ఎలా ఉండబోతుందో ఇప్పటికీ నేరుగా చెప్పని మెగాస్టార్ ఈ పోస్టర్‌తో విందుకు సిద్ధంగా ఉండాలని తన అభిమానులకు సూచించినట్లుగా ఉందంటున్నారు. అయితే ఇది అభిమానులు డిజైన్ చేసి వదిలిన టైటిల్, పోస్టర్ అనేది తెలియాల్సి ఉంది.

చిరంజీవి 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో విజయవంతమైన 'కత్తి' కథ ఆధారంగా దర్శకుడు వినాయక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ కు సమీపంలోని 'సింగప్పగూడ' అనే గ్రామంలో జరుగుతోంది. అక్కడ చిరంజీవిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రైతుల సమస్యలకు సంబందించిన సందేశాత్మక చిత్రంగా ఉండబోతోంది. ఈ చిత్రానికి మొదట 'కత్తిలాంటోడు' అన్న టైటిల్ పెడతారని వార్త వచ్చినప్పటికీ రామ్ చరణ్ టైటిల్ అదికాదని, కొత్తది ఆలోచిస్తున్నామని తెలిపాడు. ఆలాగే ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరనేది కూడా ఇంకా నిర్ణయించలేదు. ఇకపోతే వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుంచాలని మెగా క్యాంప్ నిర్ణయించింది.

English summary
Mega Star Chiranjeevi 150th film is going to release under his son Mega Power Star Ram Charan production banner. According to unveiled information, Mega Star Chiranjeevi 150th movie ‘Nepolian’ is a Tamil remake movie ‘Kaththi’ in which Vijay is acted as lead actor in Tamil language. The Tamil film ‘Kaththi’ is directed by famous director A. R. Murugadoss and now this movie remake in Telugu language is going to direct by dashing director V. V. Vinayak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu