»   » ఉపాసన స్పెషల్ పూజ: భర్త హిట్ కొట్టాలనా? లేక మామగారి కోసమా?

ఉపాసన స్పెషల్ పూజ: భర్త హిట్ కొట్టాలనా? లేక మామగారి కోసమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ స్వయంగా కొణిదల మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి తొలిసారి నిర్మిస్తున్నచిత్రం 'కత్తిలాంటోడు'. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం తన తండ్రి చిరంజీవి 150 వ చిత్రం అనే సంగతి తెలిసిందే. చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం, రామ్ చరణ్ నిర్మిస్తున్న తొలి చిత్రం కావటంతో ...ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.

మరో ప్రక్క 'కత్తిలాంటోడు' ఘన విజయం సాధించాలని కోరుతూ చిరంజీవి కోడలు, ఆ సినిమా నిర్మాత, హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన అన్నవరం ..రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. కొద్దిమంది అభిమానులతో ఆమె ఆలయానికి వచ్చారు.

Chiru 150th: Upasana special Pooja

ఆలయంవద్ద ఆమెకు పండితులు సాదర స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవునికి ఉపాసన ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అనివేటి మండపంలో పండితులు ఆమెకు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆమె విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట దేవస్థానం ఉద్యోగి గంటా విష్ణు, చిరంజీవి అభిమాని కత్తిపూడి బాబీ తదితరులున్నారు.


సౌత్ లో టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. చిరంజీవి గత చిత్రాలు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దేవిశ్రీ విజయవంతమైన సంగీతం అందించారు.
English summary
Upasana performed special pooja to Lord Satyanarayana for the success of the film titled ‘Kattilantodu’ in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu