»   »  కొడుకుతో 'చిరు' స్టెప్పులు ...

కొడుకుతో 'చిరు' స్టెప్పులు ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram-Chiru
ఎప్పుడెప్పుడా అని చిరు అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం వచ్చంది. చిరు..రామ్ చరణ్ తేజ కాంబినేషన్ ని చూడాలన్న వారి కల నెరవేరబోతోంది. తాజాగా చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాలో గెస్ట్ గా చేస్తున్నారు.అయితే కొద్ది సేపే కావటం గమనార్హం.అయితేనేం ఆ క్రేజ్ ఎంతో హైప్ ని తెచ్చిపెడుతుంది. యమదొంగ లో తాత మనవడులను గ్రాఫిక్స్ తో కలిపిన రాజమౌళే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం. ఆయన దర్శకత్వంలో పునర్జన్మల కానెస్ట్ తో తయారవుతున్న సినిమాలో ఈ సీన్ ఉంటుది. ఓ ప్రక్క రాజకీయంగా ఎంట్రీ ఇవ్వటానికి చిరంజీవి సమాయత్తమవుతున్న సమయంలో ఈ న్యూస్ రావటం సినీ అభిమానులను సంతోషపెడుతోంది. రామానాయుడు సినీ విలేజ్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సన్నివేశం చిత్రీకరణ చేసారు.

ఘరానా మొగుడు చిత్రం లోని బంగారు కోడిపెట్ట సాంగ్ కి తండ్రి కొడుకులిద్దరూ డాన్స్ చేయటమే ఈ సన్నివేశం. వాస్తవానికి రాజమౌళి కొద్ది రోజుల క్రిందట ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని చిరంజీవిని అడిగాడుట .అయితే ఆయన మొదట ఒప్పుకోలేదు. అయితే పట్టుదలగా మళ్ళీ కలసి ఈ పాటకి సినిమాలో ఉన్న ప్రాధాన్యత వివరించి ఒప్పించాడుట. దాంతో రాజమౌళి,రామ్ చరణ్ తేజ కాంబినేషన్ అంటేనే ఆకాశాన్నంటే అంచనాలు ఈ స్పెషల్ తో మరింత పెరగటం ఖాయమని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X