»   » మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగేది ఎక్కడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగేది ఎక్కడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఈ నెల 22న గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే వేదికగా చిరంజీవి 150వ సినిమా ప్రటించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో భాగంగానే పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటేలా చేస్తున్నారని టాక్.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మెగాస్టార్ బర్త్ డే పార్టీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 21 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు అభిమానుల సమక్షంలో చిరు కేక్ కట్ చేస్తారని తెలుస్తోంది. ఆగస్టు 22న ఉదయం కుటుంబ కుటుంబ సభ్యులతో గుడి వెళ్లి, అనంతరం తనకోసం వచ్చే ప్రముఖులను కలవనున్నారట.

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఈ పుట్టినరోజుతో ఆయన 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మరో వైపు ఆయన 150వ సినిమా ‘ఆటో జానీ' కూడా మొదలు కాబోతోంది. అందుకే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇటు మెగా ఫ్యామిలీ, అటు మెగా ఫ్యాన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.

Chiru birthday celebrations at Gachibowli stadium

కనీ వినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యేలా, నేషనల్ మీడియాను సైతం ఆకర్షించేలా బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

చిరంజీవి 150వ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా... పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారు. పుట్టినరోజు వేడుక సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు స్వయంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు... రక్తదానం, నేత్రదానం క్యాంపులు కూడా నిర్వహించబోతున్నారు. పేదలకు వస్త్రధానం, మొక్కలు నాటడం, అన్నదానం, స్పెషల్ పూజా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్.... ఇలా చాలా కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Chiranjeevi Fans association has organized huge program at Gachibowli stadium to celebrate Chiru's birthday.
Please Wait while comments are loading...