»   » చిరంజీవి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ ఫోన్ చేసారు: రాజమౌళి

చిరంజీవి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ ఫోన్ చేసారు: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే గ్రేట్ ఫిల్మ్ ‘బాహుబలి'. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ సెట్టింగులు, భారీగా ఆర్ట్ వర్క్, భారీ విజువల్ ఎఫెక్ట్స్....ఇలా అన్ని విషయాల్లోనూ భారీ తనమే. భారతీయ సీని చరిత్రలో తొలిసారిగా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి భారతీయ ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

మరో వైపు రాజమౌళికి సినీ ప్రముఖలందరి నుండి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన ఆయన్ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ...మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ తనకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసారని తెలిపారు.

మరో వైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో....నటించలేక పోయాననే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. బాహుబలి సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక అద్భుతమైన సినిమా అని బిగ్ బి చెప్పుకొచ్చారు. ఇండియన్ మూవీ బాక్సాఫీసు వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి గురించే చర్చ.

Chiru, Charan and NTR appreciate Rajamouli!

‘బాహుబలి' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. దర్శకుడు రాజమౌళి వివిధ మీడియా సంస్థల ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తున్నారు.

సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నకిద్దీ టెన్షన్ పెరిగి పోతోందని, లోపలి ఒత్తిళ్లను కవర్ చేసుకోవడానికి బలవంతంగా నవ్వాల్సి వస్తోందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్న రాఘవేంద్రరావు ఇంత వరకు సినిమాను చూడలేదని, దీంతో తమపై ఒత్తిడి రెట్టింపయిందని రాజమౌళి చెప్పారు.

బాహుబలి సినిమా మొత్తం బాహుబలి పాత్రతో ముడిపడి ఉంటుందని, ఆ పాత్రకు ప్రభాస్ ను మినహా వేరొకరిని ఊహించుకోవడం కష్టమని రాజమౌళి అన్నారు. తెలుగులో ఈ చిత్రం 100 కోట్ల మార్కు దాటుతుందనే ధీమా వ్యక్తం చేసిన రాజమౌళి విడుదల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు.

సినిమాలో పాత్రల పేర్లు డిపరెంటుగా ఉన్నాయని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ...నాన్నగారు పాత్రలకు చిత్రమైన పేర్లు పెడుతుంటారు. గతంలో ఆయన కాట్రాజ్, టిట్లా లాంటి డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. అదే తరహాలో బాహుబలి, భళ్లాలదేవ, బిజ్జలదేవ, కాలకేయ, శివగామి లాంటి డిఫరెంట్ పేర్లు పెట్టారు. బాహుబలి కథ కంటే ముందే పాత్రల పేర్లు పుట్టాయని రాజమౌళి తెలిపారు.

English summary
SS Rajamouli said that Megastar Chiranjeevi, Ram Charan and Young Tiger Jr NTR called him through phone and appreciated him for his work on Baahubali.
Please Wait while comments are loading...