»   »  చిరుగాలికి అనంతపురం అతలాకుతలం!!!

చిరుగాలికి అనంతపురం అతలాకుతలం!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu


చిరంజీవి రాజకీయ వార్త అనంతపురం జిల్లాను అతలాకుతలం చేస్తోంది. చిరంజీవి రాజకీయాలలోకి వచ్చినా ముఖ్యమంత్రి వైయస్ కు ఢోకా లేదని ఆ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్రమంత్రి జె.సి.దివారకర్ రెడ్డి ధీమాగా చెప్పిన రెండో రోజే అనంతపురం రాజకీయాలు తారుమారు అవుతున్నాయి. చిరంజీవి రాజకీయాలలోకి వస్తే అందులో చేరతానని జె.సి.దివాకర్ రెడ్డి సోదరుడు జె.సి.ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటన దివాకర్ రెడ్డి కి గుబులు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. జె.సి.ప్రభాకర్ రెడ్డి జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కావడం ఇక్కడ గమనించదగ్గ అంశం.

ఇదిలా ఉంటే తామేం తక్కువ తినలేదని తెలుగుదేశం నాయకులు మరొక అడుగు ముందుకు వేశారు. రాజీనాలకు పల్పాడ్డారు. అనంతపురం కార్పోరేటర్లు పలువురు శనివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పలువురు మండల పరిషత్ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ తమను పట్టించుకోకపోవడం మూలంగానే తాము రాజీనామాలకు పాల్పడ్డామని వారు పేర్కొంటున్నారు. తాము ఎప్పటినుంచో చిరంజీవి అభిమానులుగా ఉంటున్నాం కాబట్టి ఆయన పార్టీ పెడితే ఆయన వెన్నంటే ఉంటామని వారు పేర్కొంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X