»   » 'చిరు' కోసం మెగా ఫ్యాన్స్ ‘రోబో’ డైరెక్టర్ తో డిస్క్ ర్షన్స్...!?

'చిరు' కోసం మెగా ఫ్యాన్స్ ‘రోబో’ డైరెక్టర్ తో డిస్క్ ర్షన్స్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన 'రోబో" నిన్న విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా టాక్ విన్న తర్వాత మెగా అభిమానులు శంకర్ ని కలవాలని అనుకుంటున్నారట. తమ అభిమాన హీరో మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సిందిగా శంకర్ ని కోరబోతున్నారని తెలుస్తోంది. శంకర్ అయితే చిరంజీవి 150వ సినిమాని కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలడని, చిరంజీవి రీ ఎంట్రీ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించాలంటే శంకర్ లాంటి దర్శకుడు తప్పని సరి అని మెగా అభిమానులు భావిస్తున్నారట. అందుకే చెన్నైలోని శంకర్ నివాససానికి శంకర్ ని రిక్వెస్ట్ చేయాలని చెన్నైలో వున్న మెగా అభిమానులు భావిస్తున్నారట. అంతే కాకుండా చిరంజీవి కూడా రోబో ఆడియో ఫంక్షన్ లో శంకరతో సినిమా చేయాలనుందని కూడా తెలియజేయడం గమనార్హం. సో ఇందుకు శంకర్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu