»   » నిజంగా చిరు కొందరివాడేనా? ఆందోళనలో అభిమానులు

నిజంగా చిరు కొందరివాడేనా? ఆందోళనలో అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సంవత్సరాల క్రితం "కాపునాడు" దర్శకరత్న దాసరి నారాయణరావుకీ, మెగాస్టార్‌ చిరంజీవికీ మధ్య చిచ్చురేపింది. అప్పట్లో తలెత్తిన వివాదం.. ఇంకా రగులుతూనే ఉంది పైకి అప్పుడప్పుడూ తాము కలిసే వున్నామని దాసరి, చిరంజీవి చెప్పొచ్చుగాక, కానీ దాసరి చిరంజీవి మీద ఎంత క్పంగా ఉంటారో..ఎంతగా చిరంజీవిని చులకన చేస్తారో అందరికీ తెలుసు.అయితే ఇప్పుడు మరోసారి కాపు రిజర్వేషన్ల ఉద్యమం మరోమారు ఇద్దరి మధ్యా వివాదానికి కారణమవుతోందట.

ప్రస్తుతానికి చిరంజీవిని వెంటేసుకుని దాసరి మీడియా ముందుకొచ్చి హడావిడి చేస్తున్నా, ఈ కాపు సమావేశాల్లో రానురాను చిరంజీవికి ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తోంది. మొత్తంగా కాపు నేతలందరినీ దాసరి నారాయణరావు తన గుప్పిట్లో పెట్టుకున్నారన్నది నిర్వివాదాంశం. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులంతా వైఎస్సార్సీపీకి చెందినవారే. వీరందరితోనూ దాసరి సన్నిహితంగా వుంటున్నారు.

chiru

కాంగ్రెస్‌ నుంచి పల్లంరాజు తదితరులూ దాసరి గ్రూప్‌లోనే చేరిపోయారు. రామచంద్రయ్య, చిరంజీవి మాత్రమే ప్రత్యేకంగా పక్కకి నెట్టివేయబడ్డారన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న గాసిప్‌. మొదట్లో చిరంజీవిని కలుపుకున్నట్టే కనిపించిన దాసరి ఇప్పుడు మళ్ళీ మెగా స్టార్ ని పక్కకు జరుపుతున్నారు... ఈ మార్పంతా గత మూడు రోజుల్లోనే జరగటం గమనార్హం...

అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చిరు అభిమానులు మరింత దిగులు పడుతున్నారు. దీనికి కారణం దాదాపు 9 సంవత్సరాల తరువాత చిరంజీవి నటించిన సినిమా విడుదల అయ్యే సమయానికి చిరంజీవి అందరి వాడిలా ఉండాలి కాని ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే కొందరి వాడిగా ఒక ముద్ర వేయించు కోవడం చిరంజీవి వీరాభిమానులకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు...

అంతేకాదు చిరంజీవి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు చిరంజీవి 150వ సినిమా విజయం పై కొంత వరకు ప్రభావితం చేస్తాయని మెగా అభిమానులు కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాలలో ఉండే జీవితం వేరూ..సినిమాలో ఉందాల్సిన వ్యక్తిత్వం వేరు.

ఇప్పుడు తెర బయట జరిగే సంఘటనలన్నీ రేపు సినిమా ఫలితాల మీద ప్రభావం చూపిస్తాయేమో అని ఆందోళన చెందుతున్నారు ఆయన అభిమానులు... ఇలాంటివి చూసినప్పుడే "రాజకీయాలో లేదా సినిమాలో ఏదో ఒక్కటే అన్న పవన్ కళ్యాణ్ కరెక్టేమో అన్నిపించటం లేదూ...

English summary
Mega star chiranjeevi fans worrying about his activity about kapu reservation with Mudragada.. may effects on his New Movie results
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu