»   »  'చిరుత' తో చిరు?

'చిరుత' తో చిరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiru-Ram
గతంలో ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏన్నార్-నాగార్జున, కృష్ణ-మహేష్ బాబు ఇలా తండ్రీ కొడుకులు కలసి చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కుమారుడు రామ్ చరణ్ తేజ కలసి నటించేందుకు నటించేందుకు అంగీకరించారని రూమర్స్ వినిపిస్తున్నాయి. 1993-94లో మెగాస్టార్ అభిమానులను ఉర్రూతలూగించిన 'ఘరానా మొగుడు' చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట.. వచ్చెనండి, హె పప్పా.. హె పప్పా... హే పాప్పా... చెంగాబి చీర కట్టు.. చూసుకోండి..' పాటని రాజమౌళి చేస్తున్న సినిమాలో రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రామ్ చరణ్‌తో పాటు చిరంజీవి సైతం మళ్లీ తెరపై అలనాటి స్టెప్పులు వేయనున్నారనేదే హాట్ హాట్ టాపిక్.

వాస్తవానికి కష్టంగా అనిపించే ఈ రూమర్ నిజమైతే.. వెండితెరపై మరో తండ్రీ-కొడుకుల జంట నటనను తిలకించే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు లభిస్తుంది. కాగా, 'ఛత్రపతి', 'యమదొంగ', 'కంత్రి' చిత్రాలకు కొరియాగ్రాఫర్‌గా పని చేసి, మంచి మార్కులు కొట్టేసిన ప్రేమ్ రక్షిత్ ఈ సాంగ్‌కు కొరియాగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఇక చిరంజీవి రాజకీయరంగ ప్రవేశానికి ముందు ఆయనను మరోసారి వెండితెరపై తిలకించటం మంచి ఎక్సిపీరియన్స్ అంటున్నారు అభిమానులు. అయినా యమదొంగలో తాత,మనువడులను తెరపై కలిపిన రాజమౌళి ఈ అధ్భుతం చెసినా ఆశ్చర్యం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X