»   »  చిరంజీవి భార్య కూడా నిర్మాతగా

చిరంజీవి భార్య కూడా నిర్మాతగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన చిరంజీవి అభిమానులను ఆనందపరిచేలా ఆ మధ్యన రామ్ చరణ్ ..వన్ ఇండియా సైట్ ద్వారా..తన తండ్రి 150 వ చిత్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో న్యూస్ బయిటకు వచ్చింది. ఈ చిత్రాన్ని కొణిదల ప్రోడక్షన్ బ్యానర్ పై, రామచరణ్ మరియు ఇతని తల్లి సురేఖా ఈ సినిమాను నిర్మిస్తారు.

అలాగే..ప్రస్తుతం రజినికాంత్ సినిమా రోబో -2 ని నిర్మిస్తున్న లైకా ప్రోడక్షన్ వారు ఈ సినిమాకు కో-ప్రోడ్యూసర్ గా ఉంటారని సమాచారం. తమిళ సినిమా కత్తి సినిమాను తెలుగులో చిరు తన 150వ సినిమాగా రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో లాంచ్ చేయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.

Chiru's 150th film will be produced by his wife

అఖిల్ సినిమాతో తన తప్పేంటో తెలుసుకున్న డైరక్టర్ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు.
ఈ సినిమాకు సుమారు 100కోట్ల కు తక్కువ కాకుండా, చిరంజీవి 150 సినిమాకు ఖర్చు చేయాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారని, ఈ చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైంది కాబట్టి... సినిమా చాలా లావిష్ గా ఉండలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయాలనుకుంటున్నారు.

కాని మెగాస్టార్ ఇందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీనికి కారణం బ్రూస్ లీ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో అనవసరంగా డబ్బును ఖర్చు చేయోద్దని చిరు తన కొడుకు రామ్ చరణ్ కి సలహ ఇచ్చారంటున్నారు. మరోక కారణం, లిమిటెడ్ బడ్జెట్ లోనే ఒరిజినలే సినిమా పూర్తి చేసారు, ఎలా తీయాలో మెత్తం తెలుసున్న సినిమాకి అంత ఖర్చు అనవసరం అని , తమిళ కత్తి 60 కోట్లలో ఫినీష్ అయ్యిందని, మహా అయితే మరోక 10 కోట్లు అవుతాయి తప్ప ఇంక అనవసరం అని నిర్ణయించుకున్నారు

English summary
Ram Charan and his mother Surekha on their Konidela Productions Banner will be producing prestigious 150th film . VV Vinayak will be wielding megaphone for this project.
Please Wait while comments are loading...