»   » నెట్ లో చక్కర్లు కొడుతున్న చిరు కొత్త సినిమా పోస్టర్

నెట్ లో చక్కర్లు కొడుతున్న చిరు కొత్త సినిమా పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా లో అప్పుడూ ఇప్పుడూ మెగాస్టార్ గా చిరంజీవిగారిది ఒక ప్రత్యేక స్థానమే. ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నా అభిమానుల్లొ ఆయనమీదున్న ప్రేమలొ ఏమాత్రం మార్పులేదు.మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ముహూర్తం ఫిక్స్ అయిందో లేదో ..ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌లు, టీజర్‌లు నెట్‌లో హల్ చేస్తున్నాయి. తమ అభిమాన హీరో సినిమా కోసం ఎన్నాళ్లనుంచో వెయిట్ చేసిన ఫ్యాన్స్, తాజాగా ముహూర్తం డేట్ ఫిక్స్ అయ్యే సరికి. ఆనందం తో తమకు నచ్చిన స్టైల్లో చిరు కొత్త సినిమా "కత్తిలాంటొడు" పోస్టర్‌లని డిజైన్ చేస్తున్నారు.

chiru's new movie kattilantodu poster gone viral

తాజాగా చిరు " కత్తిలాంటోడు"కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ సైట్స్‌లో వైరల్ లా పాకుతోంది. ఫ్రొఫెషనల్ పోస్టర్ లకి ఏ మాత్రం తగ్గకుండా విజయ్ నటించిన తమిళ మూవీ కత్తి పోస్టర్ మాదిరిగానే ఈ పోస్టర్‌ని డిజైన్ చేయడం విశేషం. నిజంగానే 'కత్తిలాంటోడు' ఫస్ట్ లుక్ ఇదేనా అనే మాదిరిగా డిజైన్ చేసి నెట్ లో పెట్టడంతో ఇది నిజంగానే చిత్ర యూనిట్ రిలీజ్ చేసారా లేక ఫ్యాన్స్ క్రియాట్ చేసి వదిలారా అంటూ ఎక్కడ చూసిన ఈ పోస్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఫేస్ బుక్ ఫ్యాన్స్ పేజీల్లో అయితే చిన్నసైజు పండగ వాతావరణమే...

ఇక చిత్ర ఈ ముహుర్తపు షాట్ కు ఎవరినీ ఆహ్వానించటం లేదట కేవలం మెగా ఫ్యామిలీ వారు మాత్రమే హాజరువుతున్నారని సమాచారం . పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇంకా మిగతా మెగాఫ్యామిలీ లోని హీరోలు మాత్రమే హాజరువుతున్నారని సమాచారం. వివి వినాయక్ దర్శకత్వంలో చిరు 150వ చిత్రం తెరకెక్కనుండగా, రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

English summary
chiru's new movie kattilantodu poster created by unknown fan gone viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu