»   » మీలో ఎవరు కోటీశ్వరుడు కి టాటా చెప్పేసిన చిరంజీవి?

మీలో ఎవరు కోటీశ్వరుడు కి టాటా చెప్పేసిన చిరంజీవి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో పాపులర్ అయిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమాన్ని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ప్రసారమైన తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ప్రసారం అవుతున్న నాలుగో సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి

'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంఈకే షోకు రెస్పాన్స్ అదిరిపోతుందని టీవి ఛానెల్ వాళ్లే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా భావించారు. దానికి తోడు ..ఈ షో ఆరంభంలోనే నాగార్జున గెస్ట్ గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

బార్క్ రేటింగ్స్ ప్రకారం

బార్క్ రేటింగ్స్ ప్రకారం

ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్టులోనూ 'ఎంఈకే'కు టాప్ ప్లేస్ లో ఉంటుందనుకుంటే అలాంటిదేమీ దక్కలేదు. అసలు టాప్-5లోనే ఎంఈకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమైంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం 'జనతా గ్యారేజ్' ప్రిమియర్ షో రోజున అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చాయి.

నాలుగో సీజన్ కు నాగ్ స్థానంలో మెగాస్టార్

నాలుగో సీజన్ కు నాగ్ స్థానంలో మెగాస్టార్

ఏడాదిన్నర కిందట నాగార్జున హోస్ట్ గా మొదలుపెట్టిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం పెద్ద సంచలనం సృష్టించింది. తెలుగు టీవి హిస్టరీ లోనే మరే కార్యక్రమానికి రాని స్థాయిలో ఊహించిన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది ఈ కార్యక్రమం. ఐతే తొలి సీజన్ తో పోలిస్తే తర్వాతి రెండు సీజన్లలో రేటింగ్స్ తగ్గుతూ వెళ్లడంతో నాలుగో సీజన్ కు నాగ్ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చింది మాటీవీ యాజమాన్యం.

ఫెయిల్యూర్

ఫెయిల్యూర్

దాంతో ఈ ఫెయిల్యూర్ ని చిరంజీవి కి కట్టబెట్టడం పద్దతి కాదంటున్నారు. అంతేకాదు ఈ షో మీద ముందు నుండి సోషల్ మీడియాలో కొంత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నప్పటి నుండే దీనిపై నెగెటివ్ ప్రచారం మొదలైంది. తాజాగా చిరంజీవి హోస్ట్ గా షో మొదలయ్యాక వాట్సాఫ్ లో ఈ షో మీద నెగెటివ్ ప్రచారం మరింత ఎక్కువైంది.

డిజాస్టర్‌ దిశగా

డిజాస్టర్‌ దిశగా

మామూలుగా కంటే ఎక్కువగా సెలబ్రిటీలని పిలిపిస్తూ జనాల దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సెలబ్రిటీ ఎపిసోడ్స్‌ కూడా క్లిక్‌ అవకపోయే సరికి ఏం చేయాలో చిరంజీవికి, నిర్వాహకులకి పాలుపోవడం లేదు. చిరంజీవి బుల్లితెర ఎంట్రీ మెగా సక్సెస్‌ అవుతుందని అనుకుంటే, ఆరంభం నుంచే ఇది డిజాస్టర్‌ దిశగా సాగింది.

పెద్ద మిస్టేక్‌

పెద్ద మిస్టేక్‌

ఆల్రెడీ బోర్‌ కొట్టేసిన కాన్సెప్ట్‌ని తీసుకుని చిరంజీవి టెలివిజన్‌ రంగంలోకి రావడం పెద్ద మిస్టేక్‌ అయింది. ఎన్ని విధాలుగా టీఆర్పీలు పెంచడానికి చూసినా కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు ఏ దశలోను పుంజుకోలేకపోయింది. అయితే మొదటి సీజన్‌ పూర్తి చేయడం బాధ్యతగా తీసుకుని చిరంజీవి దానిని కొనసాగించారు.

నెలతో మొదటి సీజన్‌ పూర్తి

నెలతో మొదటి సీజన్‌ పూర్తి

ఈ నెలతో మొదటి సీజన్‌ పూర్తవుతుంది. నిజానికి సెప్టెంబర్‌లో మళ్లీ సీజన్‌ స్టార్ట్‌ చేయాల్సి వుంది కానీ అది ఇక జరగదని అంటున్నారు. సెప్టెంబర్‌ నుంచి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి చిరంజీవి డేట్స్‌ కేటాయించారు. ఏకధాటిగా వచ్చే మార్చి వరకు షూటింగ్‌ జరుగుతుంది నుక వచ్చే ఏడాది మే వరకు చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి అందుబాటులో వుండరు.

ఫుల్‌స్టాప్‌ పెట్టాలని

ఫుల్‌స్టాప్‌ పెట్టాలని

మూడు సీజన్లు చేయడానికి ఒప్పందం చేసుకున్న మెగాస్టార్‌ ఇక్కడితో దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, కొత్త ప్రోగ్రామ్‌ ఏదైనా ప్లాన్‌ చేద్దామని మా నెట్‌వర్క్‌తో చెప్పారని టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవి ఫ్రీ అయ్యేలోగా కాన్సెప్ట్స్‌ వర్క్‌ చేసి మెగాస్టార్‌ స్థాయికి తగ్గ షో సెట్‌ చేయాలని మా బృందం కృషి చేస్తున్నట్టు సమాచారం.

English summary
the Latest News frome Tollywood is that Megastar Chiranjeevi is going to be out frome the show meelo Evaru Koteeswarudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu