»   » రాజమౌళి అప్పట్లో లూజు....నేనే మార్చాను, రమా ఇంకా ఏం చెప్పారంటే!

రాజమౌళి అప్పట్లో లూజు....నేనే మార్చాను, రమా ఇంకా ఏం చెప్పారంటే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి 2 మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న వేళ యూనిట్ అంతా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన రమా రాజమౌళి కూడా మీడియా ఛానల్స్ కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు, రాజమౌళికి, తమ ఫ్యామిలీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రమా రాజమౌళి వెల్లడించారు. ఆమె అన్ని విషయాలకు సరైన సమాధానమే ఇచ్చారు కానీ... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎదురైనపుడు మాత్రం తెలివిగా దాట వేసే ప్రయత్నం చేసారు.

కట్టప్ప బాహుబలిని చంపడంపై...

కట్టప్ప బాహుబలిని చంపడంపై...

బాహుబలి కథను రాజమౌళి తనకు ఎప్పుడో ఐదేళ్ల క్రితం చెప్పాడని.... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం తనకు ఇపుడు గుర్తు లేదంటూ ఆ ప్రశ్నను తెలివిగా దాటవేసే ప్రయత్నం చేసారు రమా రాజమౌళి.

కట్టప్ప బాహుబలిని అందుకే చంపాడనే రూమర్ స్టోరీ నచ్చిందిజ

కట్టప్ప బాహుబలిని అందుకే చంపాడనే రూమర్ స్టోరీ నచ్చిందిజ

మొదట్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న మాత్రమే ఉండేది? ఇపుడు బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప నిజంగానే చంపాడా? అని కూడా మాట్లాడుకుంటున్నారు. కొందరేమో పలు కారణాలు చూపుతూ కట్టప్ప అందుకే చంపారు అని ప్రచారం చేస్తున్నారు. ఇలా బయట ప్రచారం అయిన ఊహాగానాల్లో ... త‌మ రాజ్య సంక్షేమం కోసం బాహుబ‌లి త‌న‌ను తాను చంప‌మ‌ని క‌ట్ట‌ప్ప ఆదేశించాడ‌ని ప్రచారంలో ఉన్న క‌థ త‌న‌కు బాగా నచ్చిందని రమా రాజమౌళి తెలిపారు.

రాజమౌళి అప్పట్లో లూజు బట్టలేసుకునే వారు

రాజమౌళి అప్పట్లో లూజు బట్టలేసుకునే వారు

రాజమౌళిని తాను ఏ విషయంలోనూ మార్చలేక పోయాను. అయితే మొద‌ట్లో రాజ‌మౌళి లూజు బట్ట‌లు వేసుకుని తిరిగేవారు, అలాంటి బట్టలే వేసుకోకుండా పర్ఫెక్ట్ ఫిట్ గా ఉండే బట్టలు వేసుకునేలా మాత్రం ఆయనలో మార్పు తేగలిగాను అని రమారామౌళి తెలిపారు.

రాజమౌళి తీసిన యమదొంగ నచ్చలేదు

రాజమౌళి తీసిన యమదొంగ నచ్చలేదు

రాజ‌మౌళి తీసిన సినిమాల్లో త‌న‌కు య‌మ‌దొంగ న‌చ్చలేద‌ు. ఎందుకు నచ్చలేదు అంటే కారణం మాత్రం నా వద్ద లేదు. కానీ, ఆ సినిమా బాగానే ఆడింద‌ని, తార‌క్ వల్లే ఆ సినిమా విజ‌యం సాధించిందేమోన‌ని తాను అనుకుంటున్నాన‌ని రమా రాజమౌళి అన్నారు.

కీరవాణి వివాదంపై

కీరవాణి వివాదంపై

కీరవాని ట్విట్టర్ కామెంట్ల వివాదంపై కూడా రమా రాజమౌళి స్పందించారు. కీర‌వాణి త‌న అభిప్రాయాన్ని తెల‌ప‌డం ఆయ‌న‌ ఇష్టమ‌ని, ఆయ‌న‌కు ఆ హ‌క్కు ఉందని అన్నారు. ఇత‌రులు ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఏకీభ‌వించ‌డం, ఏకీభవించ‌క‌పోవ‌డం అన‌వ‌స‌ర‌మ‌ని చెప్పారు. కీరవాణి ట్విట్టర్ కామెంట్స్ వివాదం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అపుడు భావోద్వేగం ఆపుకోలేక పోయా

అపుడు భావోద్వేగం ఆపుకోలేక పోయా

బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా వేదికపై సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి ‘ఎవ‌్వడంట.. ఎవ్వడంటా.. బాహుబ‌లి తీసింది.. మా పిన్నికి పుట్టాడు ఈ నందిగాని నంది' అంటూ పాడిన పాటతో రాజమౌళితో పాటు తాను కూడా భావోద్వేగానికి గురయ్యానని రమా రాజమౌళి తెలిపారు. ‘మా పిన్నికి పుట్టాడు ఈ నందిగాని నంది' అన‌గానే అప్పుడు త‌న‌కు త‌న‌ అత్త‌మ్మ గుర్తుకొచ్చిందని అన్నారు. అప్పుడు త‌న‌కు ఏడుపు వ‌చ్చేసిందని, అస్స‌లు త‌లెత్త‌లేక‌పోయానని అన్నారు. ఎంతో ఎమోష‌న్ అయిపోయానని చెప్పారు. ఆ వేదిక‌పైకి ఇక‌ త‌లెత్తి చూడ‌లేద‌ని, అనంత‌రం ఇంటికి వెళ్లి యూ ట్యూబ్‌లో ఆ వీడియోను చూశానని, వేదిక‌పై స్క్రీన్‌పై త‌న‌ అత్త‌మ్మ ఫొటో కూడా ఉందని తాను అప్పుడు గ్రహించానని తెలిపారు.

అనుష్క మేకప్ కోసం చాలా కష్టం

అనుష్క మేకప్ కోసం చాలా కష్టం

బాహుబలి పార్ట్ 1లో అనుష్క్ అలాంటి ఒక భయంకరమైన లుక్ లో చూపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె స్కిన్ చాలా సెన్సిటివ్... మేకప్ వేస్తే రాసెస్ వచ్చేవి. దీంతో వైద్యుల సలహాతో చాలా జాగ్రత్తగా మేకప్ చేయాల్సి వచ్చింది అని రమా రాజమౌళి తెలిపారు.

కార్తికేయ సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

కార్తికేయ సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

రాజమౌళి సినిమాల గురించి అందరికీ తెలుసు కానీ.... ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రమారాజమౌళి తమ జీవితానికి సంబంధించి ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలు ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Rama Rajamouli Chitchat with Media about Baahubali 2 movie. Baahubali 2: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning. The film is scheduled for a worldwide release on 28 April 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu