»   » బుర్రలేని వాళ్లే, రాజమౌళిని టచ్ చేయలేరు: బాహుబలి-2 వేడుక వేళ కీరవాణి సంచలనం!

బుర్రలేని వాళ్లే, రాజమౌళిని టచ్ చేయలేరు: బాహుబలి-2 వేడుక వేళ కీరవాణి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి ప్రాజెక్టు మ్యూజిక్ డైరెక్టర్, ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పెద్దన్న అయిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి.... బాహుబలి 2 ప్రీరిలీజ్ ఫంక్షన్ రిలీజ్ వేళ ట్విట్టర్ ద్వారా తన 27 ఏళ్ల తన సినీ సంగీత ప్రయాణాన్ని నెమరు వేసుకున్నారు.

ఈ 27 ఏళ్ల కాలంలో తన జర్నీ ఎలా సాగింది. తన రిటైర్మెంట్ విషయంలో ఎలాంటి స్పందన వస్తోంది, రాజమౌళి సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ రావడానికి కారణాం ఏమిటి? ఇలా పలు అంశాలపై కీరవాణి ట్వీట్స్ రూపంలో స్పందించారు.

మౌళి సర్‌తో మొదలై రాజమౌళితో

నా ప్రయాణం మౌళి సర్‌తో మొదలైంది. 27 ఏళ్ల తర్వాత చూస్తు ఇప్పుడు ఇక్కడ ఇలా నేను రాజమౌళితో ఉన్నాను.. అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

జయాపజయాలు

దేవుడు నాకు జయాపజయాలు రెండూ ఇచ్చాడు. ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రతిసారీ ఓ పాఠం నేర్చుకున్నాను అంటూ కీరవాణి ట్వీట్ చేసారు

రాజమౌళిని ఎవరూ టచ్ చేయలేరు

నేను రాజమౌళితో ఉన్నంతకాలం అతన్ని ఎవరూ టచ్ చేయలేరు. కానీ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకునే సమయం నాకోసం వెయిట్ చేస్తోంది....అంటూ కీరవాణి పేర్కొన్నారు.

రిటైర్మెంటుపై

సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని రెండేళ్ల కిత్రం నేను ప్రకటించాను. దీనిపై నాకు అన్ని వైపుల నుండి మిశ్రమ స్పందన లభించింది... అని కీరవాణి తెలిపారు.

99 శాతం అదే కోరుకుంటున్నారు

నేను సినిమాల నుంచి దూరం కాకూడదని 99శాతం మంది కోరుకున్నారు. ఇందులో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఉన్నారు అని కీరవాణి తెలిపారు.

కొందరు మాత్రం హ్యాపీగా

నా రిటైర్మెంటే విషయంలో కొందరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. వారంతా సోషల్ మీడియా గుర్తింపు లేని ఐడి ద్వారా తమ అభిప్రాయం వెల్లడించిన వారే అని కీరవాణి అన్నారు.

అనంత శ్రీరామ్‌ ఒక్కడే ధైర్యంగా

నా రిటైర్‌మెంట్‌పై ధైర్యంగా, నేరుగా నా మొహం చూసి మాట్లాడి మద్దతు తెలిపిన వ్యక్తి అనంత శ్రీరామ్‌ ఒక్కడే... అని కీరవాణి తెలిపారు.

తమన్ నా రిటైర్మెంటు కోసం

తమన్‌ నేను రిటైర్ అయ్యే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. నా సహాయకుడు జీవన్‌తో ఈ విషయమై అనేకసార్లు ఆరా తీసాడు... అని కీరవాణి చెప్పుకొచ్చారు.

తమన్ నా అభిమానే కానీ

తమన్‌ నాకు వీరాభిమాని కూడా... నేనే రిటైర్ అయితే నా వద్ద పని చేసే జీవన్ ను అతడు దక్కించుకోవాలని చూస్తున్నాడు. జీవన్ మంచి ఫ్రోగ్రామర్ అని కీరవాణి చెప్పుకొచ్చారు.

బుర్రలేని వారితో పని చేసా

నేను నా కెరీర్లో ఎక్కువగా బుర్రలేని చాలామంది దర్శకులతో నేను పనిచేశాను. వారు నా మాటలు వినేవారు కాదు.... అని కీరవాణి సంచలన కామెంట్స్ చేసారు.

రాజమౌళికి హిట్ మ్యూజిక్ అందుకే

రాజమౌళి సినిమాలకు మాత్రమే నా నుండి అద్భుతమైన సంగీతం రావడానికి కారణం అతడు... నేను చెప్పింది వింటాడు కాబట్టే అని కీరవాణి ట్వీట్ చేసారు.

నన్ను కేవలం అలానే చూసారు

చాలామంది దర్శకులు నన్నో సంగీత దర్శకుడిగా మాత్రమే చూసేవారు. నా నుండి వచ్చే మంచి సలహా తీసుకోవడంలో అశ్రద్ధ చూపే వారు అని కీరవాణి ట్వీట్ చేసారు.

ప్లాప్ అవుతుందని ముందే తెలిసేది

దర్శకులు కథ చెప్పే సమయంలోనే ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందని నేను అంచనా వేసే వాడిని. కానీ దర్శకులు చెవిటివారిలా నా మాట వినపడనట్లు ఉండే వారు అని కీరవాణి తెలిపారు.

ఎదురుదెబ్బ తగులుతుంది

వినకపోవడం అనేది మంచి ట్యూన్లకు ఎలాంటి హాని చేయదు. కానీ మంచి సలహాను పెడచెవిన పెడితే అది డైరెక్టర్‌కు కచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది. అతని చిత్రంతో పాటు, వ్యక్తిగత కెరీర్‌పైనా చెడు ప్రభావం చూపుతుంది అని కీరవాణి అన్నారు.

అలాంటి వారితో చేయను

ఒకవేళ నేను నా కెరీర్‌ కొనసాగించాల్సి వస్తే నా శ్రేయోభిలాషుల కోసం పనిచేస్తా. అంతేకానీ నా మాటను వినిపించుకోని, పట్టించుకోని వారి కోసం పనిచేయను అని కీరవాణి తెలిపారు.

నాలో రచయితను చూసి గర్విస్తా

నేను వారితో పని చేయను అనడానికి కారణం సంగీత దర్శకుడిగా నేనెప్పుడూ గర్వంగా ఫీల్‌ అవుతున్నట్లు కాదు. నాలో ఉన్న రచయితను చూసి గర్వపడతాను అని కీరవాణి అన్నారు.

విజయం వారు ఊహించలేదు

‘బాహుబలి1' భారీ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. డైరెక్టర్‌, నిర్మాతలు, వారాహి సాయిగారితో సహా ఎవరూ నమ్మలేదు అని కీరవాణి అన్నారు.

నేను నమ్మాను

బాహుబలి విజయం విషయంలో అంబికా కృష్ణ సానుకూలంగా ఆలోచించారు. ఇలాంటి విజయం వస్తుందని నేను ముందు నుండి చాలా నమ్మకంగా ఉన్నాను అని కీరవాణి అన్నారు.

అతడు అహంభావి కానీ

నేను క్రాంతి కుమార్ సార్ గురించి చెప్పడం మరిచిపోయాను. అతడు అహంభావి కానీ రెస్పెక్టెడ్ టాలెంట్ ఉంది అని అన్నారు కీరవాణి.

గర్విస్తాడనుకుంటున్నా

రాజమౌళిని చూసి గర్విస్తాడని అనుకుంటున్నాను అంటూ కీరవాణి ట్వీట్.

బఫూన్ కాదు

క్రాంతి కుమార్ బఫూన్ ఏమాత్రం కాదు అంటూ కీరవాణి ట్వీట్.

ఆర్కా మీడియా లేకుంటే

ఆర్కా మీడియా లేకుంటే ఇండియాలో ఇంత పెద్ద సినిమా లేదు అని కీరవాణి అన్నారు.

వర్మ గురించి

క్షణ క్షణం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను మాత్రమే యాక్టెప్ట్ చేయమని సలహా ఇచ్చారని కీరవాణి ట్వీట్ చేసారు.

నా గాడ్ ఫాదర్

రాఘవేంద్రరావు నా గాడ్ పాదర్, ఆయన మళ్లీ పెళ్లి సందడి లాంటి సోషల్ సినిమాల మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నట్లు కీరవాణి ఆకాంక్షించారు.

రాజమౌళి స్టాండర్డ్స్ రీచ్ కాలేరు

రాజమౌళి స్టాండర్డ్స్ ను ఎవరూ రీచ్ కాలేరు. అతడి అంకిత భావం, పాషన్ మరెవరికీ ఉండవు. ఇది వంద శాతం నిజం, ఇది నా వేద వాక్కు అంటూ కీరవాణి ట్వీట్ చేసారు.

రాజమౌళి తర్వాత

రాజమౌళి తర్వాత నా నమ్మకం ఎక్కువగా కాంచి మీదనే. నా అభిప్రాయాలతో అతడి అభిప్రాయాలు వంద శాతం మ్యాచ్ అవుతాయి అని కీరవాని అన్నారు.

English summary
"Nobody can touch Rajamouli as long as I am with him. But the point is I have my retirement waiting for me. When I announced my retirement 2 years ago, I received mixed response from all the corners." Keeravani tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu