twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ స్టేటస్ లేక క్రేజ్ కోల్పోతున్న హీరోలు...?

    By Sindhu
    |

    ఒకప్పుడు సినిమాలన్నీ కథలపైనే ఆధారపడేవి..కానీ ఇప్పుడు అలా కాదు..నటీనటులను బట్ట కథలు తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మన తెలుగు సినీ పరిశ్రమలో..కొత్త హీరోవున్నా, పెద్ద హీరో వున్నా కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. హీరో సంగతి పక్కన పెడ్డితే కథలో దమ్ముంటే సూపర్ హిట్ అవ్వడం ఖాయం. అప్పుడు ఆ చిత్రం మార్కెట్ లో కలెక్షన్స్ బాగా వసూలు చేస్తుంది. నిర్మాత డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కి లాభాలు తెచ్చిపెడుతుంది..

    ఒకప్పుడు క్రేజ్ ఉన్న తారలకు ఇప్పుడు అసలు డిమాండు ఉండకపోవడంతో వారు నటించిన సినిమాలను పంపిణీ చేయాలంటేనే పంపిణీదారులు భయపడుతున్నారట. ఈజాబితాలో పలువురు ప్రముఖ నటులు చేరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో కొత్తవారితోకాని, పాత నటులలో ప్రేక్షకులను ఆకర్షించే శక్తి కోల్పోయారని భావిస్తున్నవారితో కాని సినిమా తీయాలంటేనే నిర్మాతలు అంతగా సుముఖత చూపడం లేదట. దీనిపై వస్తున్న కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి టాలివుడ్ లో టాప్ ఫైవ్ స్టార్స్ కే మార్కెట్ ఉంటోందని సిని విశ్లేషకులు కధనాలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోలను బట్టి కథలను రాస్తున్నారు. కథల్లో కొత్తదనం వుండకుండా మూసధోరణిలో వుంటున్నాయి. సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు.

    ప్రస్తుతం అంతగా గిరాకి లేని నటులలో శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, నాని, తనిష్, ఆకాష్, నవదీప్, ఆర్యన్ రాజేష్, శివాజి, కృష్ణుడు, రాజ, నిఖిల్ వంటి నటులతో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారట. స్టార్ స్టేటస్ లేని నటులతో సినిమా తీస్తే, ఆ సినిమా ఆడడం కష్టం అవుతోందని, జనాన్ని హాళ్లకు రప్పించడానికి అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రముఖ పంపిణీదారుడు, పుల్లారెడ్డి చెబుతున్నారు. మరో నిర్మాత , డైరెక్టర్ సిద్దార్ధ ఈ వాదనతో అంగీక రిస్తూ, సినిమాలను ప్రసారం చేసే టెలివిజన్ ఛానళ్లు, కాని విదేశాలలోని కొనుగోలు దారులు కాని మొదటి ఐదు స్థానాలలో ఉండే స్టార్స్ నటించిన సినిమాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నాయని చెప్పా రు.

    అయితే అలా మొదలైంది సినిమా సక్సె స్ అవడంతో కొందరు చిన్నబడ్జెట్ సినిమాలను తీయడానికి ముందుకు వస్తున్నారు. కాని ఇది చాలా కష్టంతో కూడుకున్నదని, జాగ్రత్తగా సినిమా తీయాల్సి ఉంటుందని, ఆ సినిమా నిర్మాత దామోదర ప్రసాద్ అంటున్నారు. మారిపోతున్న అభిరుచులు, అలాగే పరిస్థితులు నటులకు కూడా పెద్ద పరీక్షగానే మిగులుతున్నాయి.

    English summary
    Film industry is always filled with shocking news every day. Often some are easily digestible while some others are never digested. With distributors, exhibitors and even satellite channels being star-struck, new ideas and “non” stars are having a tough time breaking into Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X