»   » వ్యభిచారం మంచిదే, అనుమతివ్వండి... సినీస్టార్ కామెంట్

వ్యభిచారం మంచిదే, అనుమతివ్వండి... సినీస్టార్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అతి ప్రాచీనమైన వృత్తుల్లో వ్యభిచారం కూడా ఒకటి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ వృత్తి కొనసాగుతోంది కూడా. అయితే మన దేశంలో చాలా కాలం క్రితమే వ్యబిచార వృత్తిని నిషేదించారు.

అయితే వేశ్యల వల్ల దేశానికి మంచే జరుగుతుంది అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో భారత్-పాక్ సరిహద్దులోని వేశ్యాగృహం కాన్సెప్టుతో తెరకెక్కుతున్న 'బేగమ్ జాన్' మూవీలో నటిస్తున్న చుంకీ పాండే ఇటీవల ఇంటర్వ్యూలో వ్యభిచార వృత్తి గురించి, వేశ్యల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

బేగమ్ జాన్

బేగమ్ జాన్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చుంకీ పాండే మాట్లాడుతూ... ‘బేగమ్ జాన్' మూవీ వేశ్యా గృహం, దాన్ని నిర్వహించే బేగమ్ జాన్ గురించే. విద్యా బాలన్ బేగమ్ జాన్ పాత్రలో ఒదిగిపోయారు. ట్రైలర్ చూసాక ఆమె ఈ సినిమాను మరో లెవల్ కి తీసుకెలుతుందనే నమ్మకం ఏర్పడిందని చుంకీ పాండే తెలిపారు.

వల్గారిటీ లేదు

వల్గారిటీ లేదు

సినిమా వేశ్యల గురించి, వేశ్యగృహ నిర్వాహకురాలి గురించి అంటే.... చాలా మంది ఇందులో వల్గారిటీ ఉంటుందని భావిస్తున్నారు. కానీ సినిమాలో అలాంటిదేమీ లేదు. ఇదో బోల్డ్ మూవీ, సమాజం సిగ్గుపడాల్సిన అసలు కానే కాదు అని తెలిపారు.

మహిళా సాధికారత గురించి కాదు

మహిళా సాధికారత గురించి కాదు

సినిమా మహిళా సాధికారత గురించి అని మేము ఏమీ చెప్పడం లేదు. ఇలాంటి అలాంటి సబ్జెక్టు కూడా కాదు. ఇది ఒక పవర్ ఫుల్ ఉమెన్ స్టోరీ. ఆమె ఒక వ్యవభిచార గృహ నిర్వాహకురాలు అని చుంకీ పాండే తెలిపారు.

వేశ్యల వల్ల మేలు

వేశ్యల వల్ల మేలు

అతి పురాతనమైన వృత్తుల్లో వ్యభిచారం కూడా ఒకటి. కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ నిషేదం ఉంది. కానీ వేశ్యల వల్ల దేశానికి మేలు జరుగుతుంది. ఈ వృత్తిని చట్టబద్దం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో సెక్సువల్ ప్రస్టేషన్ ఎలా ఉందో అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ వృత్తిని లీగలైజ్ చేస్తే ఆ ప్రస్టేషన్ తగ్గే అవకాశం ఉంది అని చుంకీ పాండే అభిప్రాయ పడ్డారు.

బేగమ్ జాన్

బేగమ్ జాన్

బేగమ్ జాన్ చిత్రానికి శ్రిజిత్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ముఖేష్ భట్, విశేష్ భట్ సంయుక్తంగా ప్లే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన బేగం జాన్ ట్రైలర్ మార్చి 14న విడుదలైంది. 'రాణి లక్ష్మీబాయి, రజియా సుల్తాన్‌, మీరాబాయి వంటి తదితరుల స్ఫూర్తితోనే ప్రస్తుతం నటిస్తున్న బేగం జాన్‌ పాత్రను రూపకల్పన చేయటం ఆనందంగా ఉందని అంటోంది విద్యాబాలన్‌.

బెంగాలీ చిత్రం 'రాజ్‌కహిని'

బెంగాలీ చిత్రం 'రాజ్‌కహిని'

శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన బెంగాలీ చిత్రం 'రాజ్‌కహిని' ఆధారంగా బాలీవుడ్‌లో 'బేగం జాన్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్ విద్యాబాలన్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది. ట్రైలర్ విడుదలైన ఒక్కరోజులోనే యూట్యూబ్‌లో కోటి మందికి పైగా వీక్షించడం విశేషం.

బేగం జాన్‌ వ్యక్తిత్వం

బేగం జాన్‌ వ్యక్తిత్వం

విద్యాబాలన్‌ మాట్లాడుతూ,'ఈ చిత్రంలో నటించటానికి ప్రధాన కారణం బేగం జాన్‌ వ్యక్తిత్వం. వేశ్యా గృహంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో బేగం జాన్‌ ధైర్యసాహసాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. రాణి లక్ష్మీబాయి, రజియా సుల్తాన్‌, మీరా బాయి వంటి హేమా హేమీల యాటిట్యూడ్‌ని స్ఫూర్తిగా తీసుకుని బేగం జాన్‌ పాత్రను మరింత బలోపేతం చేశారు. ఇటువంటి చిత్రంలో నటించటం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.

కథ ఏమిటంటే

కథ ఏమిటంటే

రెండు దేశాల సరిహద్దులో ఉన్న వేశ్యగ‌‌ృహాన్ని మధ్య విభజన రేఖ వెళ్తున్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇస్తారు. అందుకు జవాబుగా బేగమ్ జాన్ "మీరూ కోట అని నాలుకతోనూ, వేశ్యావాటిక అని మనసుతోనూ అనుకునే ఈ స్థలం . నా ఇల్లు..., నా దేశం.. విభజనను నేను ఒప్పుకొను. ఒకవేళ మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నిస్తే వారి చేతులను, కాళ్లను, దేహాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తాను" అని హెచ్చరిస్తుంది. బేగమ్ జాన్ ఎలా పోరాడింది అనేదే సినిమా.

rn

రిలీజ్ డేట్

ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
"Begum Jaan movie about powerful women who are in the oldest profession in the world: Prostitution. Unfortunately, it is looked down upon. They are doing a favour to the nation, it should be legalised. Imagine the sexual frustration in the country if it didn't exist!" Chunky Pandey said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu