twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం' ఎఫెక్ట్ : సినిమాటోగ్రఫీచట్టం సమీక్ష

    By Srikanya
    |

    హైదరాబాద్ : కమల్‌హాసన్‌ 'విశ్వరూపం' వివాదం... సినిమాటోగ్రఫీ చట్టాన్ని సమీక్షించుకొనేలా చేసింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో కూడిన జ్యుడిషియల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ముకుల్‌ ముద్గల్‌ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో షర్మిలా ఠాగూర్‌, జావేద్‌ అఖ్తర్‌ తదితరులున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ సినిమాటోగ్రఫీ చట్టాన్ని పరిశీలించి మార్పుచేర్పుల్ని సూచిస్తుందని ఆ శాఖ మంత్రి మనీష్‌ తివారీ న్యూఢిల్లీలో వెల్లడించారు.

    కమల్‌హాసన్‌ తాజా చిత్రం విశ్వరూపం విడుదలపై ఏర్పడిన వివాదం నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సినిమాటోగ్రఫీచట్టం సమీక్షకోసం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. 8మంది సభ్యులుండే ఈ కమిటీకి ఢిల్లీ హైకోర్ట్‌లో ప్రధానన్యాయమూర్తిగా పనిచేసి పదవీవిరమణ చేసిన ముకుల్‌ ముద్గల్‌ నాయకత్వం వహిస్తారు. కమిటీలో అలనాటినటి షర్మిలా టాగూర్‌, ప్రముఖ బాలీవుడ్‌ గీత రచయిత జావేద్‌ అఖ్తర్‌కూడా ఉంటారు.

    సెన్సార్‌బోర్డ్‌ అనుమతి ఇచ్చిన తర్వాతకూడా విశ్వరూపం సినిమాను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిషేధించడం కేంద్రప్రభుత్వాన్ని సినిమాటోగ్రఫీచట్టాన్ని సమీక్షించేందుకు పురిగొల్పింది. సెన్సార్‌ బోర్డ్‌ నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వాలు విధిగా అమలుచేసేలా చూడటానికి చట్టబద్ధమైన వ్యవస్థ లేదా నియంత్రణ వ్యవస్థ ఏదైనా అవసరమా అని ఈ కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖమంత్రి మనీష్‌ తివారి చెప్పారు.

    రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ ప్రకారం ఒక సినిమా ప్రదర్శనకు యోగ్యమైనదా, కాదా అనేది నిర్ణయించే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉందని, సెన్సార్‌ బోర్డ్‌ద్వారా ఈ అధికారాన్ని అమలుచేస్తామని తివారి అన్నారు. ఈ బోర్డ్‌ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రప్రభుత్వాలు దానిని అమలుచేసితీరాలని చెప్పారు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని మరింత పటిష్ఠంగా, సెన్సార్‌ బోర్డ్‌ అనుమతి ఇచ్చిన తర్వాత సినిమాలను అడ్డుకునే వీలులేకుండా ఉండేలా సినిమాటోగ్రఫీ చట్టాన్ని మార్చాలనుకుంటున్నట్లు తివారి తెలిపారు.

    English summary
    In the wake of row over Kamal Haasan’s movie Vishwaroopam, the Centre on Monday set up a judicial committee to have a relook at the Cinematograph Act to make it more robust and ensure that movies do not get stuck after clearances by the film certification board. The 8-member Committee, headed by retired Chief Justice of Punjab and Haryana High Court Mukul Mudgal, also include film star Sharmila Tagore and noted poet and MP Javed Akhtar. The committee was set up by the Information and Broadcasting Ministry against the backdrop of Vishwaroopam being banned by the Jayalalithaa-led Tamil Nadu government despite the Censor Board’s clearance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X