twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీ షాక్: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

    By Srikanya
    |

    ముంబై: ప్రముఖ సినిమాటోగ్రఫార్ బాబీసింగ్ గోవాలో చనిపోయారు. 38 ఏళ్ల బాబీసింగ్ కొంతకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్స్ గ్యాంగ్‌స్టర్, ది డర్టీ పిక్చర్ తదితర సినిమాలకు ఆయన పనిచేశారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. బాలీవుడ్‌లో అతి పిన్నవయస్కుడైన సినిమాటోగ్రాఫర్ బాబీ సింగే. కాగా కుటుంబీకులతో సరదాగా గడిపేం దుకు ఆయన కొద్దిరోజుల క్రితం గోవా వెళ్లారు. బాలీవుడ్‌ ప్రముఖులు బాబీ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

    క్రిసమస్ సెలబ్రేషన్స్ కి గోవా కి ఫ్యామిలీతో వెళ్లిన బాబీసింగ్ తిరిగి శవమై వస్తారని ఊహించలేదని ఆయన సన్నిహితులు విషాదంతో అంటున్నారు. ఆయన అక్కడ గోవాలో సీఫుడ్ తినటం వల్ల అస్తమా తిరగబెట్టిందని, ఆ ఎలర్జీని కంట్రోలు చేయలేకపోయారని వైద్యులు వివరించారు. హాస్పటిల్ కి తీసుకు వెళ్తూండగానే ఆయన దారిలోనే మరణించారు.

    2006లో వచ్చిన గ్యాంగస్టర్ చిత్రంతో పరిచయమైన ఆయన డర్టీ పిక్చర్ ద్వారా స్టార్ సినిమాటోగ్రాఫర్ గా ఎదిగారు. లైఫ్ ఇన్ మెట్రో, జన్నత్ 2 , కైట్స్ వంటి చిత్రాలు ఆయను ఖాతాలో ఉన్నాయి. ఆయన రీసెంట్ గానే కాజల్,అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'స్పెషల్ చబ్బీస్' చిత్రం షూటింగ్ పూర్తి చేసారు. పిబ్రవరి 8న ఆ చిత్రం విడుదల అవుతోంది.

    English summary
    Ace cinematographer Bobby Singh, who carved a niche for himself in Bollywood through his brilliant work for films like The Dirty Picture, Life in a Metro and Jannat 2, died on Tuesday while taking a Christmas break in Goa. The 38-year-old was in Goa to celebrate Christmas with family when he suffered a severe asthmatic attack triggered by an allergic reaction after he reportedly ate seafood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X