ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో మార్పులు... సీకె షాక్, రంగంలోకి చోటా!
ఎన్టీఆర్ హీరోగా కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ మూవీ సాంకేతిక బృందంలో కీలకమైన మార్పు చోటు చేసుకుంది. ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సికె మురళీధరన్ ఉన్నట్టుండి
హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై లవకుశ' మూవీ సాంకేతిక బృందంలో కీలకమైన మార్పు చోటు చేసుకుంది. ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సికె మురళీధరన్ ఉన్నట్టుండి సినిమా నుండి తప్పుకున్నారు.
బాలీవుడ్లో త్రీ ఇడియట్స్, పికె, మొహంజోదారో లాంటి భారీ చిత్రాలకు సికె మురళీధరన్ పని చేసారు. మరి ఆయన ఎందుకు ఉన్నట్టుండి తప్పుకున్నారు? దర్శకుడు, హీరోతో ఆయన అడ్జెస్ట్ కాక పోయాడా? లేక నిర్మాత కళ్యాణ్ రామ్ తో ఏమైనా విబేధాలు వచ్చాయా? అనే విషయం ఇంకా బయటకు రాలేదు.

రంగంలోకి చోటా
సికె మురళీధరన్ స్థానంలో చోటా కె నాయుడు ‘జై లవ కుశ' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. చోటా కె నాయుడు తెలుగులో టాప్ మోస్ట్ డిమాండింగ్ ఉన్న సినిమాటోగ్రాఫర్ అనే విషయం తెలిసిందే.

ఫస్ట్ లుక్
కాగా... 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు కేవలం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ మాత్రమే రిలీజైంది. మే 20న ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

రూ. 30 కోట్ల లాభం? ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలు



Click it and Unblock the Notifications











