Just In
- 8 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనుకున్నదొకటి అయ్యిందొకటి!! చిరంజీవి సినిమాలో మెహన్ బాబు.. ఇదీ సంగతి
చిరంజీవి, మోహన్ బాబు ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో అలరించారు. వీళ్ళిద్దరూ కలిసి తెరపంచుకున్నారంటే.. ప్రేక్షకులకు కనువిందే అని ఫిక్స్ అయిపోయేవారు ఆ నాటి ప్రేక్షకులు. అయితే అదే టేస్ట్ ఈ నాటి ప్రేక్షకులూ చూడనున్నారని, చిరంజీవి- మోహన్ బాబు ఇద్దరూ కలిసి కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారని టాక్ వింటున్నాం. తాజాగా దీనిపై స్పందిస్తూ చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి పోతే..

చిరంజీవి కోరిక.. మెగా 152
ఇటీవలే ‘సైరా నరసింహారెడ్డి' సినిమాతో చారిత్రక నేపథ్యంలో ఓ సినిమాలో తీయాలనే తన చిరకాల కోరిక తీర్చుకున్న చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

మెహన్ బాబు రోల్.. అంతా కూల్
అయితే ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మెహన్ బాబు భాగం కానున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మోహన్ బాబు రోల్ ప్రత్యేక ఆకర్షణ కానుందని టాక్ బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై చిత్రయూనిట్ స్పందించింది. మోహన్ బాబు రోల్‌పై క్లారిటీ ఇవ్వడంతో అంతా కూల్ కావాల్సిన పరిస్థితి నెలకొంది.

మోహన్ బాబు- చిరంజీవి.. అనుకున్నదొకటి అయ్యిందొకటి!!
తమ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడనే వార్తలు అవాస్తవం అని చల్లగా చెప్పేస్తోంది చిత్రయూనిట్. మోహన్ బాబుకు తగ్గ క్యారెక్టర్ తమ సినిమాలో లేదని, ఒకవేళ ఆయనకు తగ్గ క్యారెక్టర్ ఉంటే తప్పక సంప్రదించే వాళ్లమని పేర్కొన్నారు. దీంతో మోహన్ బాబు- చిరంజీవి స్క్రీన్ స్పేస్ చూడాలని కుతూహల పడిన ఆడియన్స్ అనుకున్నదొకటి అయ్యిందొకటి!! అని తలపట్టుకున్నారు.

చిరంజీవి- కొరటాల.. కాన్సెప్ట్ ఇదే..
ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, త్రిషలపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం పడుతుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు.

ఫ్రెష్ లుక్‌లో చిరు.. రామ్ చరణ్ పాత్ర
ఈ చిత్రంలో దాదాపు ఐదారు కిలోల వరకు బరువు తగ్గిన చిరంజీవి.. వెండితెరపై ఫ్రెష్ లుక్‌లో కనిపించనున్నారు. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో ఆయన కనిపించనున్నట్టు సమాచారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా గెస్ట్ రోల్ పోషిస్తుండటం విశేషం.