»   » యూత్‌ను టెమ్ట్ చేస్తున్న రొమాంటిక్ మూవీ (ఫోటోలు)

యూత్‌ను టెమ్ట్ చేస్తున్న రొమాంటిక్ మూవీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం యువతరం మెచ్చే సినిమాల హవా నడుస్తోంది. యూత్‌కు నచ్చే విధంగా సినిమా తీస్తే చాలు ఆ సినిమా మినిమం గ్యారంటీ అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ప్రేమ కథా చిత్రాలు, రొమాంటి సబ్జెక్టుతో కూడిన కథాంశాలతో కూడిన సినిమాల జోరుగు సాగుతోంది.

అలాంటి తరహా చిత్రాల్లో ఒకటి 'కాఫీ విత్ మై వైఫ్'. అనీష్ తేజేశ్వర్, సింధు లోక్‌నాథ్ జంటగా నీలం శంకర్ సమర్పణలో మదన్ నిర్మించారు. విద్యాసాగర్ దర్శకుడు. కొత్తగా పెళ్లైన జంట మధ్య జరిగే చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన స్టిల్స్ యూత్‌ను టెమ్ట్ చేసే విధంగా ఉన్నాయి. వారిని థియేటర్ల వైపు ఆకర్షించేందుకు ప్రత్యేకంగాఫోటోషూట్ నిర్వహించిన మరీ ఈ స్టిల్స్ విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది. అందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో.....

కాఫీ విత్ మై వైఫ్

కాఫీ విత్ మై వైఫ్


కొంచెం పాలు, కొంచెం షుగర్, కొంచెం కాఫీ పొడి కలగలిపితే మంచి కాఫీ తయారవుతుంది. కొంచెం ప్రేమ, కొంచెం రొమాన్స్, కొన్ని అలకలు కలగలిస్తే చక్కని దాంపత్యం అవుతుందనే కథాశంతో రూపొందిన చిత్రం 'కాఫీ విత్ మై వైఫ్'.

కాన్సెప్టు ఏమిటంటే...

కాన్సెప్టు ఏమిటంటే...


'కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ ఇద్దరు ప్రేమికుల జీవితంలోని కొంగొత్త పరిణామాలే ఈ సినిమా. లైఫ్‌లో రొమాన్స్ ఉండాలనేది కొత్త తరం కోరిక. అది ఎలా ఉంటే అందంగా ఉంటుందో తెలియజెప్పే సినిమా. పెళ్లి చేసుకోబోయేవాళ్లకు, చేసుకున్నవాళ్లకు ఇద్దరికీ జీవితంలో కొత్త కోణాలను చూపిస్తుందట ఈ సినిమా.

విడుదల ఎప్పుడు?

విడుదల ఎప్పుడు?


ఈ చిత్రాన్ని మార్చి ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

దర్శక, నిర్మాతలు ఏమంటున్నారు

దర్శక, నిర్మాతలు ఏమంటున్నారు


స్వీట్ రొమాన్స్, ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ల కలబోత ఈ సినిమా. పాటలకు మంచి ఆదరణ లభించింది. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అని దర్శక నిర్మాతలు అంటున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


చిత్రానికి సంగీతం: "మంత్ర" ఆనంద్, సాహిత్యం: చైతన్య ప్రసాద్, బాలాదిత్య, కెమెరా: విశ్వ దేవబత్తుల, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: శ్రీనివాస్, కథ - మాటలు - నిర్మాత: మదన్, దర్శకత్వం: విద్యాసాగర్.

English summary
Anish Tejeshwar & Actress Sindhu Lokanath starring Coffee With My Wife movie release next month. Directed by Vidyasagar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu