»   » ప్రకాశ్ రాజ్‌, మధుర శ్రీధర్ మధ్య ముదిరిన కోల్డ్ వార్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

ప్రకాశ్ రాజ్‌, మధుర శ్రీధర్ మధ్య ముదిరిన కోల్డ్ వార్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సినీ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డికి మధ్య సోషల్ మీడియాలో కొత్త వివాదం తలెత్తింది. సోషల్ మీడియా అకౌంట్‌లో బ్లాక్ చేయడంతో మధుర శ్రీధర్ తీవ్రంగా స్పందించారు. ఇంతకీ వారి మధ్య వివాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు. కానీ వారి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నదని స్పష్టమవుతున్నది. అసలు వివాదానికి కారణం ఏమిటంటే..

  మధుర శ్రీధర్‌ను ప్రకాశ్ రాజ్ బ్లాక్

  మధుర శ్రీధర్‌ను ప్రకాశ్ రాజ్ బ్లాక్

  సోషల్ మీడియాలోని ట్విట్టర్‌ అకౌంట్‌లో మధుర శ్రీధర్ రెడ్డి, ప్రకాశ్ రాజ్ ఒకరికొకరు ఫాలో అవుతున్నారు. అయితే అనూహ్యంగా మధుర శ్రీధర్‌ను ప్రకాశ్ రాజ్ బ్లాక్ చేశారు. మధుర శ్రీధర్ తన అకౌంట్‌లో దానికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు.

   ట్విట్టర్ నుంచి మధుర శ్రీధర్‌కు మెసేజ్

  ట్విట్టర్ నుంచి మధుర శ్రీధర్‌కు మెసేజ్

  ప్రకాశ్ రాజ్ మిమ్మల్ని బ్లాక్ చేశారు. ప్రకాశ్ రాజ్‌ను ఫాలో అవుతున్న మిమ్మల్ని ఆయన బ్లాక్ చేశారు. అలాగే ఇక నుంచి ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసే ట్వీట్లను చూడటానికి వీలు ఉండదు అని మధుర శ్రీధర్‌కు ట్విట్టర్ నుంచి ఓ సందేశం వచ్చింది.

  prakash raj sensational Comments On sri reddy
   నన్ను బ్లాక్ చేసిన మొదటి వ్యక్తి

  నన్ను బ్లాక్ చేసిన మొదటి వ్యక్తి

  ట్విట్టర్ పంపిన సందేశాన్ని తన అకౌంట్‌లో ట్యాగ్ చేస్తూ.. ఇది అతని అసహనానికి నిదర్శనం. ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేసిన మొదటి వ్యక్తి ఈయనే. బహుశా సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన వారిలో భూమి మీద మొట్ట మొదటి వ్యక్తి ఆయనే అనుకొంటా అని మధుర శ్రీధర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  ప్రకాశ్ రాజ్‌కు ధైర్యం లేదు

  ప్రకాశ్ రాజ్‌కు ధైర్యం లేదు

  నాతో లాజికల్ ఆర్గుమెంట్ చేయడానికి ప్రకాశ్ రాజ్ ఎన్నడూ ధైర్యం చాలదదు. కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను. డియర్ ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ రోజులు పోయాయి. నీవు బాధ్యత కలిగిన లీడర్‌వు. ఎదైనా జవాబు ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి అని ప్రకాశ్‌ రాజ్‌కు మధుర శ్రీధర్ ట్వీట్‌లో సూచించారు.

  English summary
  Cold War between Madhura Sreedhar Reddy and Prakash Raj reaches peak level. Actor Prakash Raj has blocked Madhura Sridhar in Twitter. In this issue Madhura Sreedhar reacts on social media. He tweeted that See his intolerance. I think he is first person on this earth who blocked me on twitter. He can never face me in the logical argument. I can bet on anything! Just Asking days have gone for u dear PrakashRaaj.If you are responsible leader, it’s always #JustAnswer!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more