»   »  భం చిక్ భం చిక్ ... :'కలర్స్' స్వాతి క్రేజీ యోగా ఫోజ్

భం చిక్ భం చిక్ ... :'కలర్స్' స్వాతి క్రేజీ యోగా ఫోజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'కలర్స్' స్వాతి ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు లేరు అన్నంతగా ఎదిగిపోయింది. 'కలర్స్' ప్రోగ్రాంతో పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, క్రమంగా హీరోయిన్‌గా రాణించింది స్వాతి. ''అష్టా చమ్మా'', ''స్వామిరారా'', ''కార్తికేయ'' లాంటి చిత్రాలు స్వాతికి మంచి పేరుని అందించింది. తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. ఆమె బరువు బాగా పెరిగిందని ఆ మధ్యన విమర్శలు వచ్చాయి. వీటికి సమాధానం చెప్పటానికా అన్నట్లు యోగా మొదలెట్టింది.

తన బరువుని తగ్గించుకుని, తిరిగి షేప్ కు రావటానికి ఇదిగో ఇలా కష్టపడుతోంది. ఈ ఫొటో చూస్తే మీకు అర్దమవుతుంది. ఎంత కష్టమైన కాంప్లెక్స్ ఫోజ్ ని అయినా ఇంత ఈజిగా చేసేస్తోందా అనిపిస్తోంది కదూ. డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తున్న ఈమె తిరిగి తన అందం, షేప్ తనకు వచ్చాకే మళ్లీ మనకు కనిపిస్తుందిట. అంటే త్వరలోనే వరస సినిమాలు కమిటవుతుందన్నమాట.

Colors Swathi's crazy Yoga pose!

మరో ప్రక్క ..గలగల మాట్లాడే ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య గ్యాప్ తీసుకోవటంతో పెళ్లి కోసమే ఆమె బ్రేక్ తీసుకుంది అనే సారు. ప్రస్తుతం ఈ అమ్మడి వయస్సు 29 ఏళ్ళు కాగా, ఆమె తల్లిదండ్రులు స్వాతికి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం సినిమాలపైనే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యిందిట.

తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ అందరిచే ప్రశంసలు అందుకున్న ఆమెకు అష్టా చెమ్మా, స్వామిరారా, కార్తికేయ లాంటి చిత్రాలు స్వాతికి మంచి స్టార్‌డంని అందించాయి. రష్యాలో పుట్టిన కూడా తెలుగు భాషపై పట్టు సాధించి తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది స్వాతి. మళ్లీ త్వరలోనే తను ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో ఉందిట.

English summary
The photograph showing Colors Swathi do a complex Yoga pose effortlessly.She is indeed a fitness freak and could shed weight depending on the requirement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu