»   »  రవితేజ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు

రవితేజ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇండస్ట్రీలో లవ్‌కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయ్. బహుశా నా ఫేస్ అలా అనిపిస్తుందేమో. అంటే వాళ్లక్కూడా తెలుసేమో ఈ అమ్మాయితో ఇవన్నీ వేస్ట్ అని. ఇండస్ట్రీలో హరీష్ శంకర్, రవితేజ, బీవీఎస్ రవి అందరూ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారని చెప్తోంది కలర్స్ స్వాతి. తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ ఇలా స్పందించింది.

ఫస్ట్ లవ్ గురించి చెప్తూ... స్కూల్లో! సెవెన్త్‌క్లాస్‌లోనే వచ్చింది. అప్పుడు వైజాగ్ నేవీ స్కూల్‌లో చదువుతున్నాను. పెన్సిల్ చెక్కుకుంటుంటే క్లోజ్‌ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యు అన్నాడు. నాకు వెంటనే అర్థం కాక చెక్కుకోవడం ఆపి 'క్యా' అంటూ దీర్ఘం తీశాను. ఐ థింక్ ఐ లవ్ యూ అన్నాడు. అంతే... ఆ అబ్బాయితో మాట్లాడడం మానేశాను. వారం తర్వాత కలిసి ''నువ్వేమైనా మిస్ ఇండియావా! ఏమనుకుంటున్నావ్? ఇష్టం లేకపోతే వదిలెయ్, నాతో మామూలుగా ఉండు'' అన్నాడు. ఇప్పటికీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌మే! ఇక కాలేజ్‌లో లవ్ ప్రపోజల్స్ ఏమీరాలేదు. మా అన్నయ్య టీషర్ట్, జీన్స్, జుట్టు ముడి వేసుకుని కాస్త పద్ధతిగా వెళ్లేదాన్ని అందుకేనేమో ఎవరూ పట్టించుకోలేదు , ఇండస్ట్రీకి వెళ్లాక చాలా వచ్చాయి అంది.

పెళ్లి గురించి మాట్లాడుతూ.... ఇంకో రెండు మూడేళ్లలో ఉండొచ్చు... నాకు తెలీదండీ! చెప్పలేం కదా... ఇలాంటి విషయాల్లో. అయినా ఇప్పుడు నేను 'పెళ్లి చేసుకుందాం' అని ఆలోచించడంలేదు. 'పెళ్లంటే ఏంటా?' అని ఆలోచిస్తున్నాను. ఆ ఇన్‌స్టిట్యూషన్ నాకింకా అర్థం కాలేదు. అయితే ఆ వ్యవస్థను నేను నమ్ముతున్నానంటే అది కూడా నా పేరెంట్స్‌ని చూసి. లేదా మా ఫ్రెండ్స్ పేరెంట్స్. లేదా మా చిన్నాన్న, పిన్ని. లేకపోతే... నాకంతగా సరైన అభిప్రాయం లేదు. ఏదైనా ప్రతి పెళ్లీ డిఫరెంట్. కొన్ని పెళ్ళిళ్లు అరేంజ్‌మెంట్స్ వల్లో, డీల్స్, లవ్వూ, సోషల్ ఆబ్లిగేషన్... కారణాలతో జరిగినవి చూశాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పెళ్లిళ్లు వెరీ లక్కీ. కొంతమందివి ప్చ్... వాళ్ల లైఫ్ అంతే. ఏదైనా మంచి పార్ట్‌నర్ దొరకడం అనేదానికి మనం అదృష్టవంతులం అయి ఉండాలనేది నా ఫీలింగ్ అని చెప్పుకొచ్చారామె.

సోషల్ నెట్ వర్కింగ్ లు గురించి మాట్లాడుతూ... ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ నాలుగేళ్ల క్రితం క్లోజ్ చేశాను. ఇప్పుడు లేదు. ఇక ట్విట్టర్ వాడే దాకా బాయ్స్‌లో అంత పైత్యం ఉందనేది నాకు తెలీలేదు. ఇంత ఫస్ట్రేటెడ్‌గా ఉన్నారా మన జనరేషన్ అనుకున్నా. రండి నన్ను ఎటాక్ చేయండి అని చెప్పి వాళ్లకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది కదా... అని ట్వీట్స్ మానేశా. అందులో ఎవరైనా ఏమైనా రాయచ్చు కదా. 'ఎవరో నలుగురైదుగురు అంటే ట్విట్టర్ నుంచి వదిలేయడం ఏమిటీ అని' కొందరన్నారు. అయితే ప్రతిరోజూ రాయడానికి ఏం ఉంటుంది నాకు? షారూఖ్‌ఖాన్ అయితే దలైలామాను కలిశా అనో ఇంకోటో రాసుకోవచ్చు. నేనేం రాయాలి? మాపక్కింటివాళ్లని కలిశా అనా? ప్రతిరోజూ ఇంట్రెస్టింగ్‌గా ఏమిరాయగలను అని వివరించింది.

English summary
Swati Reddy, better known as Colours Swathi, is an Indian film actress and television presenter. Her nickname and fame comes from her stint in the television show Colours, which was telecast on Maa TV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu