»   » ఆ కారణంగానే సినిమా వదులుకుందట.. డైరెక్టర్‌కు షాకిచ్చిన కలర్స్ స్వాతి

ఆ కారణంగానే సినిమా వదులుకుందట.. డైరెక్టర్‌కు షాకిచ్చిన కలర్స్ స్వాతి

Written By:
Subscribe to Filmibeat Telugu

కలర్స్ స్వాతి హీరోయిన్‌గా తెలుగు తెర మీద కనిపించక చాలా రోజులైంది. తమిళ, మలయాళ పరిశ్రమలో నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకొన్నది. ఇంట గెలువక పోయినా రచ్చ గెలిచిన ఘనతను స్వాతి సొంతం చేసుకొన్నది.

Colours Swati

తెలుగులో చివరిసారిగా త్రిపుర చిత్రంలో కనిపించింది. అయితే తాజాగా తెలుగులో వచ్చిన ఓ సినిమా ఛాన్స్‌ను వదులుకోవడం చర్చనీయాంశమైంది. సినిమాను వదులుకోవడానికి కారణం ఆ సినిమాలో మితిమీరిన శృంగారం ఉండటమే కారణమట.

హాట్స్ సీన్స్‌లో నటించలేక..

హాట్స్ సీన్స్‌లో నటించలేక..

త్వరలో తెరకెక్కనున్న తెలుగు చిత్రంలో భారీగా హాట్స్ సీన్స్ ఉన్నాయట. గతంలో లేని విధంగా తెరపైన శృంగార సన్నివేశాల్లో భారీగా రెచ్చిపోవాల్సి ఉంటుందని నిర్మాత, దర్శకులు ముందే హెచ్చరించారట. దాంతో పాత్ర కోసం రాజీ పడలేక నా వల్ల కాదు బాబోయ్ అని ముఖం మీదే చెప్పేసిందట.

మితీమీరిన శృంగారం..

మితీమీరిన శృంగారం..

దర్శకుడు చెప్పిన కథ కంటే సన్నివేశాల్లో మితి మీరిన శృంగారం ఉంటుందనే సూచనలతో ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆందోళనకు గురైందనేది తాజా సమాచారం. అలాంటి పాత్రలు ఎంపిక చేసుకొంటే బంగారం లాంటి కెరీర్ గంగపాలు కావడం ఖాయమని సన్నిహితులు కూడా హెచ్చరించారట.

అందాల ఆరబోతకు నో..

అందాల ఆరబోతకు నో..

అయినా అందాల ఆరబోతకు చాక్లెట్ గర్ల్‌గా కనిపించే స్వాతి హాట్స్ సీన్స్‌లో అంటే తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోవడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తమిళ, మలయాళ భాషల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు వెతుక్కొంటూ వస్తుంటే ఇక్కడ హాట్ సీన్స్ చేయాల్సిన ఖర్మ పట్టలేదని దర్శకుడికి చెప్పేసిందట.

చేతిలో సినిమాలు లేవని..

చేతిలో సినిమాలు లేవని..

చిన్నతనంలో మాటీవిలో కలర్స్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు స్వాతి సుపరిచితులు. కలర్ స్వాతిగా గుర్తింపు పొందిన ఈమె అష్టాచెమ్మా, స్వామిరారా, కార్తీకేయ, కలవరమాయే మదిలో, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఏదిఏమైనా చేతిలో తెలుగు సినిమాలు లేవనో, డబ్బుల కోసమో హాట్ సీన్స్ ఉన్న సినిమాను ఒప్పుకోకపోవడంపై స్వాతిని పలువురు అభినందించినట్టు సమాచారం.

English summary
Reports suggest that Colours Swati rejected a tollywood movie is became talk of industry now. She rejected a movie due to acting Hot scenes. Swati bluntly objected producers, directors offer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu