»   » ఇక్కడ కథలకు విలువలేదు... నేనూ కర్చీఫ్ వేసే పని చేస్తా: చంటి అడ్డాల

ఇక్కడ కథలకు విలువలేదు... నేనూ కర్చీఫ్ వేసే పని చేస్తా: చంటి అడ్డాల

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్ట్ డైరెక్టర్ గా, నిర్మాత‌గా చంటి అడ్డాల తెలుగు ఇండస్ట్రీ కి కొత్తకాదు. నిర్మాతగ "అల్ల‌రి రాముడు", "అడ‌వి రాముడు" (ప్ర‌భాస్‌), "బాచి" లాంటి సినిమాలు తీసిన చంటి అడ్డాల చాలా కాం గా ప్రొడక్షన్ కి దూరం దూరంగానే ఉంటున్నాడు. అల్లరి నరేష్ తో తీసిన "యముడికి మొగుడు" తర్వాత ఆయన ఇక సినిమాలే చేయలేదు

.కొన్నాళ్ళ కింద ఇక వరుసగా సినిమాలు చేయ బోతున్నా అని మీడియా ముందు చెప్పిన చంటి అడ్డాల.. ఆ తర్వాత కూడా ఎక్కడా కనిపించలేదు.ఇన్నాళ్ళకి మళ్ళీ తన పుట్టిన రోజు నాడు ఇంకో ప్రకటణ చేసాడు... అదేమిటంటే..తాను మళ్ళీ సినిమాలు చేయబోతుమ్న్నా అని..

అయితే ఈ సందర్భంగా చంటి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. "ఇప్పుడు కథలు నమ్మే రోజులు పోయాయి. ఖర్చీఫ్‌ వేసే రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడు కథకు ఏ విలువా లేదు.హీరోలూ,దర్శకుల అందరూ ఇష్టపడుతున్నది కాంబినేషన్లను మాత్రమే" అంటూ ఇండ‌స్ట్రీలో నెలకొన్న పరిస్థితుల పై సెటైర్లు వేసారు.

Combinations only work in Tollywood than Good Stories says ChanTi Addala

అయితే చివరగా ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏమిటో తెలుసా..? అందరూ ఇలానే చేస్తున్నారు కాబట్టి తానూ ఇదే దారిని అనుసరిస్తానై చెప్పారు. "ఈ డిసెంబర్‌ నుంచి ఓ స్టార్‌ హీరోతో సినిమాను మొదలుపెడుతున్నాం. దర్శకుడెవ‌రో త్వరలోనే ప్రకటిస్తాం. ప్రస్తుతం కథను నమ్మి సినిమా చేయాలా? హీరోని నమ్మి చిత్రం చేయాలా? అనే అయోమయం ఉంది. అందుకే కథ సంగ‌తి త‌ర్వాత‌.. ముందు ఖర్చీఫ్ వేయాలి. నేను కూడా ఈ బాట‌లోనే నడుస్తాను" అని చెప్పారు

చంటి అడ్డాల‌. త‌న దృష్టిలో పెద్ద హీరోలతో సినిమా చేయడం కష్టం కాదనీ. స్టార్ హీరో ఉంటే ఓవైపు సాంకేతిక నిపుణులు మామూలు కంటే ఎక్కువగా సహకరిస్తారనీ, మరోవైపు ఆర్థిక వనరులు కూడా సులభంగా సమకూరుతాయని.

అందుకే వరుసగా పెద్ద స్టారలతోనే భారీ చిత్రాలను నిర్మిస్తూ.. మధ్యమధ్యలో మంచి కథలతో సినిమాలను చేయాల‌నుకుంటున్నాన‌ని చంటి చెప్పాడు. ఇప్ప‌టికీ త‌న‌ను ఆర్ట్ డైరెక్ష‌న్ చేయ‌మ‌ని అడుగుతూనే ఉంటార‌ని..కానీ ఇక విశ్రాంతి కోరుకుంటున్నాననీ అందుకే ఆర్ట్ డైరెక్షన్ కి దూరంగా ఉంటున్నాన‌ని అత‌న‌న్నాడు.

English summary
Chanti Addala, the art director turned producer says that.., in Tolly wood Star Combinations only work than Good Storys.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu