»   »  ఇది కామెడీ కాదు... సిక్స్ ప్యాక్ తో వస్తున్న 30 యియర్స్ పృథ్వి

ఇది కామెడీ కాదు... సిక్స్ ప్యాక్ తో వస్తున్న 30 యియర్స్ పృథ్వి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పృథ్వీ ప్రస్తుతం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే సినిమా చేశాడు. అందులో అతను హీరో తరహా పాత్ర చేశాడు. 'మల్లప్ప'లో మాత్రం అతనే హీరో అట. ఈ పాత్ర కోసం కొన్నాళ్లుగా జిమ్ కు వెళ్లి కష్టపడుతున్నానని.. సిక్స్ ప్యాక్ చేస్తున్నానని వెల్లడించాడు పృథ్వీ. ఇక 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమాలో తన పాత్రకు అంత ప్రాధాన్యం ఇవ్వడం పట్ల పృథ్వీ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో తాను ఒక సెన్సేషనల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నానని దాని కోసం సిక్స్‌ ప్యాక్‌ పెంచమని అజితే సలహా ఇచ్చాడని.. అది మూగవాడి పాత్ర అని.. చివర్లో షర్టు విప్పి సిక్స్‌ ప్యాక్‌ చూపించాల్సి ఉంటుందని వెల్లడించాడు పృథ్వీ. ఐతే 'పూలరంగడు' లాంటి హీరో బేస్డ్‌ మూవీలో సునీల్‌ సిక్స్‌ ప్యాక్‌ చూపిస్తే ఓకే కానీ.. కామెడీ క్యారెక్టర్‌ కోసం పృథ్వీ సిక్స్‌ ప్యాక్‌ చేస్తుండటమే విడ్డూరంగా ఉంది.

'సౌఖ్యం' సినిమాలో శివుడి విగ్రహాన్ని మోసే బాహుబలి స్పూఫ్‌ సీన్లోనే తన సిక్స్‌ ప్యాక్‌ తాలూకు ప్రభావం కనిపిస్తుందని పృథ్వీ చెప్పాడు. నిజానికి 'సౌఖ్యం' కోసం వేరే పాత్ర అనుకున్నామని.. ఐతే అదంత బాగా లేదని ఆలోచించి తర్వాత బాహుబలి స్పూఫ్‌ ప్లాన్‌ చేశామని పృథ్వీ చెప్పాడు. వారం వ్యవధిలో విడుదలైన శంకరాభరణం, బెంగాల్‌ టైగర్‌ సినిమాలు రెండింట్లోనూ తన పాత్రలు ప్రేక్షకులకు ఇంత వినోదాన్ని పంచడం నమ్మశక్యంగా లేదని పృథ్వీ చెప్పాడు.

Comedian "30 years industry" Prudhvi Six pack avatar

లౌక్యం' సినిమా ముందు వరకు పోస్టర్లలో తన ఫొటో చిన్న చిన్న ముక్కలుగా కనిపించేదని.. 'లౌక్యం' నుంచి తనకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమాకు పోస్టర్ నిండా తన ఫొటోనే చూసుకోవడం తనకు అద్భుతమైన అనుభవమని ఉద్వేగంగా చెప్పాడు పృథ్వీ.

చాలాకాలంగా హాస్య ప్రధానమైన పాత్రలు చేస్తున్నప్పటికీ, 'లౌక్యం' సినిమాతో పృథ్వీ దశ తిరిగిపోయింది. ఈ సినిమా నుంచి ఆయనని దృష్టిలో పెట్టుకుని పాత్రలను సృష్టించడం మొదలైంది. దాంతో వరుస సినిమాలతో ఆయన బిజీయైపోయాడు. తన నుంచి ఆడియన్స్ ఆశించే కామెడీ కోసం ఆయన సిక్స్ ప్యాక్ ను ట్రై చేస్తుండటం విశేషం.

త్వరలో ఆయన 'మల్లప్ప' అనే సినిమా చేయనున్నాడు .. ఈ సినిమాలో ఆయనే హీరో. పాత్ర పరంగా హీరో సిక్స్ ప్యాక్ తో కనిపించాలి. అందువలన ప్రతి రోజు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తున్నాడట. 50 ప్లస్ లో సిక్స్ ప్యాక్ కి ట్రై చేయడం నిజంగా విశేషమే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

English summary
Now Pruthvi's era started as the makers are giving author backed roles to him and he is carrying the comedy entertainment in films on his shoulders. Pruthi revealed that he is building six pack for Ajith's movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu