Don't Miss!
- News
కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా? జాగ్రత్త: షర్మిలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ కల్యాణ్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన ఆలీ: అసలు కారణమిదే.. ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తోటి సినీ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ ను ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిమానులే కాకుండా నేటితరం యువ హీరోలు కూడా పవన్ ను ఒక అభిమాన హీరోగా చూడటం గురించి అందరికి తెలిసిందే. ఇక హెచ్చు తగ్గులు లేకుండా స్నేహితులను సమానంగా చూసే పవన్ కు ఆలీ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక వారిద్దరి మధ్య విబేధాలు వచ్చిన విషయం గురించి కూడా అందరికి తెలిసిందే. అయితే మొదటిసారి కమెడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ తో వచ్చిన క్లాష్ పై స్పందించారు.

పవన్ కళ్యాణ్ కెరీర్ మొదటి నుంచి..
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమెడియన్ అయిన ఆలీ ఇండస్ట్రీలో 40ఏళ్ల నుంచి ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచే కమెడియన్ గా కొనసాగుతున్న ఆలీ ఒకనొక దశలో హీరోగా కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనతో దాదాపు పవన్ కళ్యాణ్ కెరీర్ మొదటి నుంచి కూడా చాలా క్లోజ్ గా ఉంటూ వస్తున్నాడు. సుస్వాగతం సినిమా నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది.

గత ఎన్నికల్లో క్లాష్
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని అంటే అందులో ఆలీ తప్పకుండా ఉంటాడని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఒకటి రెండు సినిమాల్లో తప్పితే దాదాపు ప్రతి సినిమాలో ఆలీ, పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక గత ఎన్నికల వేడిలో ఇద్దరి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఆ న్యూస్ తో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మళ్ళీ కలుసుకోరేమో అనేంతలా..
అలీ వైఎస్సార్ పార్టీలో చేరడం ఆ తరువాత పవన్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆలీ చేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్నికల అనంతరం ఆలీ మళ్ళీ పవన్ ను కలిసింది లేదు. దాదాపు ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. మళ్ళీ కలుసుకోరేమో అనేంతలా వార్తలు వచ్చాయి.

ఆలీ ఫ్యామిలీ ఫంక్షన్ లో పవన్
అయితే చాలా కాలం తరువాత పవన్, ఆలీతో కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆలీకి సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వెళ్లడం అక్కడ అలీ ని కౌగిలించుకొని ఆప్యాయంగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మొదట ఆ వీడియో పాతదేమో అని అంతా అనుకున్నారు. కానీ అది రీసెంట్ గా జరిగిన వేడుక అని ఆలీ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

విభేదాలకు కారణం..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ పవన్ తో వచ్చిన క్లాష్ పై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఆలీ మాట్లాడుతూ.. పవన్ తో జర్నీ సుస్వాగతం నుంచి కొనసాగుతోంది. విభేదాలకు కారణం కేవలం పార్టీలే. సినిమాలు వేరు పార్టీలు వేరు స్నేహం వేరు. ఎవరికి నచ్చిన పార్టీలో వారు ఉంటారు. అది కేవలం మిస్ కమ్యూనికేషన్ వల్లే అలా జరిగింది. అలా జరిగినందుకు కొంత ఫీలింగ్ అయితే ఉంటుంది.. అని చెప్పారు.

పవన్ తో మళ్ళీ సినిమాలు చేస్తా..
కరోనా లాక్ డౌన్ కారణంగా వచ్చిన గ్యాప్ వల్ల రెగ్యులర్ గా మాట్లాడుకోవడం కుదరలేదు అంతే. లేకపోతే కలుసుకొని ఉండేవాళ్ళం. పవన్ కళ్యాణ్ తో ఇక మాట్లాడను కలవను అని అనుకున్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఇది లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్ అంతే. ఇక పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంది. వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా అందులో ఉండవచ్చు.. అని ఆలీ వివరణ ఇచ్చారు.