twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్ర రావు ఆపిల్‌కు కోట్లల్లో మార్కెట్.. మోహన్ బాబు ప్రతి స్టూడెంట్ జేబులో.. అలీ!

    |

    Recommended Video

    Comedian Ali Hilarious Speech At Mohanbabu Birthday Celebrations | Filmibeat Telugu

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 69వ జన్మదిన వేడుకలు మార్చి 19 మంగళవారం ఘనంగా జరిగాయి. మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఈ వేడుకలు జరిగాయి. మోహన్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ కమెడియన్ అలీ కూడా మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అలీ తనదైన శైలిలో సరదాగా ప్రసంగిస్తూనే విద్యార్థులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మోహన్ బాబు, అలీ మధ్య సరదా సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

     ఆపిల్ పండు సృష్టి కర్త

    ఆపిల్ పండు సృష్టి కర్త

    అలీ ఏవేడుకకు హాజరైనా అక్కడ కామెడీ పంచులు బాగా పేలుతుంటాయి. వీలైనంత ఎక్కువగా ప్రేక్షకులని నవ్వించడానికి అలీ ప్రయత్నిస్తుంటాడు. మోహన్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్ వేడుకలో కూడా అలీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుపై సరదాగా సైటైర్లు వేశారు. ఆపిల్ పండు సృష్టి కర్త రాఘవేంద్ర రావు అని అలీ అన్నాడు. బహుశా స్టీవ్ జాబ్స్ రాఘవేంద్ర రావు సినిమాలు ఎక్కువగా చూసి ఉంటాడు. రాఘవేంద్ర రావు సృష్టించిన ఆపిల్ పండుని కొంచెం కొరికేసి తన ఆపిల్ ఫోన్ కు పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోన్లే కోట్లల్లో బిజినెస్ చేస్తున్నాయి అని అలీ సరదాగా వ్యాఖ్యానించాడు.

     పెన్ను విలువ

    పెన్ను విలువ

    గన్ను కన్నా పెన్ను చాలా పవర్ ఫుల్. ప్రధానమంత్రి తన నిర్ణయాల్ని అమలు చేయాలంటే పెన్ను ఉపయోగించి సంతకం పెట్టాలి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పెన్నుతోనే సంతకం చేయాలి. ఒకరికి ఉద్యోగం రావాలన్నా, అదే ఉద్యోగం పోవాలన్నా ఈ పెన్ను ఉండాలి. ఈ పెన్నుని రచయిత పేపర్ పై పెడితే మంచి కథ వస్తుంది. అందుకే పెన్నుని మన గుండె దగ్గర పెట్టుకుంటాం. పెన్ను ఉపయోగించే ప్రతి ఒక్కడు గుండె ధైర్యవంతుడు. మోహన్ బాబు గారికి చాలా ధైర్యం. ఆయన సినిమాల్లో సంపాదించిన సొమ్ముని వృధా చేయకుండా ఇంత మంది విద్యార్థుల జేబులో పెన్ను పెడుతున్నారు.. డట్ ఈజ్ మోహన్ బాబు అని అలీ ప్రశంసించాడు.

    కుట్ర వల్లే ఓడిపోయా, దమ్ముంటే మహేష్ బాబుతో రూ. 2 కోట్లు తెండి: శివాజీ రాజా సవాల్కుట్ర వల్లే ఓడిపోయా, దమ్ముంటే మహేష్ బాబుతో రూ. 2 కోట్లు తెండి: శివాజీ రాజా సవాల్

     విద్యార్థులకు మెసేజ్

    విద్యార్థులకు మెసేజ్

    ప్రతి తల్లీతండ్రీ తాము తినకున్నా మన పిల్లలు తిన్నారా లేదా అని ఆలోచిస్తారు. విద్యార్థి దశ చాలా కీలకమైనది. మీ కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని అలీ విద్యార్థులకు సూచించాడు. మన తల్లిదండ్రులని బాగా చూసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తామని అలీ తెలిపాడు. నా కుటుంబ సభ్యుల వలనే తాను ఈ స్థాయిలో ఉన్నానని అలీ తెలిపాడు.

    భార్యని కూడా

    భార్యని కూడా

    తన ప్రసంగం ఆరంభంలో మైక్ తనవద్దే ఉందనే విషయాన్ని అలీ మరచిపోయాడు. దీనిపై మోహన్ బాబు సరదాగా.. మైక్ మరచిపోయావు.. భార్యని కూడా మరచిపోతావా అని ప్రశ్నించారు. మోహన్ బాబు మాట్లాడుతూ నిండు నూరేళ్లు సినిమాలో నేను విలన్ గా నటించా.. అప్పుడు అలీ చాలా చిన్న పిల్లవాడు అని తెలిపారు. నేను ఎలా ఇండస్ట్రీకి తిండి కూడా లేని పరిస్థితుల్లో వచ్చానో, అలీ కూడా రాజమండ్రి నుంచి వచ్చి టాలీవుడ్ లో ఈ స్థాయికి చేరుకున్నాడని మోహన్ బాబు ప్రశంసించారు.

    English summary
    Comedian Ali Amazing Speech At Mohan Babu Birthday Celebrations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X