»   » సునీల్..! కాదు.. వెన్నెల కిషోర్..!! కాదు..కాదు..అలీ...!!! ఇంకెవరన్నా ఉన్నారా?

సునీల్..! కాదు.. వెన్నెల కిషోర్..!! కాదు..కాదు..అలీ...!!! ఇంకెవరన్నా ఉన్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సినిమా కత్తి నే మన మెగాస్టార్ 150 వసినిమాగా వస్తోందీ అనగానే భాష వచ్చా రాదా అన్న విశయం కూడా పట్టించుకోకుండా ఎగబడి మరీ తమిళ "కత్తి" చూసేసారు మనోళ్ళు. హీరో పాత్రకి చిరు ఓకే నుకోగానే అందరి దృష్టీ మెయిన్ క్యారెక్టర్ అయిన విజయ్ పక్కన కనిపించిన సతీష్ పాత్ర ఎవరు చేయబోతున్నారా అనే చూసారు.

హీరోయిన్ కంటే ఎక్కువ గా ఈ పాత్రమీదకే అందరి దృష్టీ మళ్ళింది. తమిళ్ ఇండస్ట్రీ లో అప్ కమింగ్ కమెడియన్ అయిన సతీష్ ఈ పాత్ర చేసాడు. కత్తి తర్వాత అక్కడ సతీష్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా దూసుకు పోయింది. ఎందుకంటే కత్తిలో ఆయన చేసింది చిన్న పాత్ర కాదు. కత్తిలో విజయ్ తర్వాత.. హీరోయిన్ సమంత కంటే ఎక్కువ సేపు కనిపించేది సతీషే. మరి అంత ఇంపార్టెంట్ పాత్ర అదీ చిరంజీవి పక్కన.... అంటే ఎవరా నటుడూ అని ఆసక్తిగా చూసారు.

comedian ali in chiru's 150th movie

ఈ పాత్ర కోసం సునీల్ ను అడిగారు దర్శకనిర్మాతలు. అయితే మొదట్లో ఓకే అన్నా.. తర్వాత షూటింగ్ లేటయ్యి సునీల్ కి డేట్లు ఖాళీ లేకపోవటంతో పక్కకి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ పాత్రకు వెన్నెల కిషోర్ ను ఎంపిక చేసారనే వార్తలు వినిపించాయి. వెన్నెల కిశోర్ కివచ్చిన చాన్స్ కొందరు కుళ్ళుకున్నారు కూడా.

అయితే నిన్న షూటింగ్ మొదటి రోజు వర్కింగ్ స్టిల్స్ చూడగానే చిరంజీవితో నటించే ఆ కమెడియన్ అలీ అని వెన్నెల కిషోర్ కూడా పక్కకు తప్పుకున్నట్టే అని కన్ఫర్మ్ అయిపోయింది. తొలి రోజు షూటింగ్ లో కనిపించిన కమేడియన్ అలీ మాత్రమే. అంటే ఈ పాత్ర కోసం అలీనే తీసుకున్నారన్నమాట. అలీ ఎంతవరకూ చిరు ఫ్రెండ్ గా మెప్పిస్తాడో చూడాలి మరి...

English summary
comedian Ali Doing a charecter in chiranjeevi's 150th movie "kattilantodu" as upcomig Comedian "sathish" in tamiL "katti"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu