»   » హాస్య నటుడు ఏవీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం

హాస్య నటుడు ఏవీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Comedian AVS admitted in hospital
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఏవీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 15 రోజులుగా ఆయన లక్డీకపూల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కంట్రోల్ అయ్యే అవకాశాలు తక్కువ అని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం.

గతంలో ఆయనకు లివర్ టాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. అపుడు ఆయన కూతురు లివర్ దానం చేసారు. అప్పటి నుంచి ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. లివర్ సమస్యతో పాటు ఆయన కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మరింత విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో ఆయనకు లివర్ సమస్య రావడానికి కారణం...షూటింగుల సమయంలో కలుషితమైన నీరు తాగడం వల్లనే అని వైద్యులు గుర్తించారు. ఆయన కూతురు తన లివర్‌లోని కొంత భాగాన్ని దానం చేయడంతో ఆయన అప్పట్లో ఆయనకు అపాయం తప్పింది. అయితే వయసు పైబడుతున్న కారణంగా ఆయన మళ్లీ అదే సమస్య పునరావృతం అయింది.

ఆయన్ను ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం ఏవీఎస్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి మనికొండలోని ఆయన కుమారుడు ప్రదీప్ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఏవీఎస్ త్వరగా కోలుకుని....తిరిగి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని ఆకాంక్షిద్దాం.  

English summary
Noted comedian and telugu film actor AVS, had been admitted into Hospital. Condition is serious. He had been been suffering from a disease related to liver.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu